ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ కు భారత్ దిమ్మదిరిగే జవాబిచ్చింది. ఇండియాలో మైనార్టీల పరిస్థితిపై పాక్ దొంగేడుపును ఎండగట్టింది. మైనార్టీలపై మాకు నీతులు చెప్పకండి అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. జెనీవాలో జరుగుతున్న యూఎన్ మానవహక్కుల కౌన్సిల్ సమావేశంలో భాగంగా పాక్ తీరుపై భారత్ మండిపడింది. పాక్ ప్రపంచ ఉగ్రవాదుల ప్యాక్టరీయేకాదు.. దేశంలోని మైనార్టీలైన హిందువులు - క్రిస్టియన్లు - షియాలు - అహ్మదీయులను తీవ్రంగా హింసిస్తున్నదని భారత్ స్పష్టంచేసింది.
ఐరాసలో జరుగుతున్న మానవ హక్కుల కౌన్సిల్ లో భారత్ లో మైనార్టీల పరిస్థితులపై మన దేశ ప్రతినిధి నవనీతా చక్రవర్తి మాట్లాడారు. "భారతదేశంలో మైనార్టీలు ప్రధానమంత్రులు - రాష్ట్రపతులు - ఉపరాష్ట్రపతులు - సీనియర్ కేబినెట్ మంత్రులు - సీనియర్ సివిల్ సర్వెంట్స్ - క్రికెట్ టీమ్స్ కెప్టెన్స్ - బాలీవుడ్ సూపర్ స్టార్స్ గా ఉన్నారు. పాక్ లో మైనార్టీలను అసలు ఇలా ఊహించగలమా? వాళ్ల మతాలను దూషించడం, మానవ హక్కుల ఉల్లంఘన, వేధింపులు.. ఇవే ఎదురవుతాయి" అని పాక్ ను కడిగేశారు.
యూఎన్ అత్యున్నత వేదికను పాక్ మరోసారి దుర్వినియోగం చేసిందని, జమ్ముకశ్మీర్ లాంటి భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం సరికాదని మన దేశ ప్రతినిధి స్పష్టంచేశారు. "భారత్ లో హింసను- ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాక్ మానుకోవాలి. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదు అని పాకిస్తాన్ కు ఈ వేదికగా చెప్పాలనుకుంటున్నాం" అని చక్రవర్తి అన్నారు. పాక్ ప్రపంచ ఉగ్రవాద ఫ్యాక్టరీలా మారిందని ఆమె తెలిపారు. భారత్‌లోని జమ్ముకశ్మీర్ లో పూర్తి ప్రజాస్వామ్యం ఉండగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రం ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మారింది అని ఆమె విమర్శించారు. భారత ప్రతినిధి ప్రసంగం పలు దేశాల ప్రతినిధులను ఆకట్టుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/