ఆర్ధిక సమస్యలతో పాకిస్తాన్ కుదేలైంది. విదేశాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. స్వదేశంలో జనరేట్ అవుతున్న సంపద అంతంత మాత్రంగానే ఉంది. దేశంలో విదేశీ కంపెనీలేవీ పెద్దగా లేవు. మరోవైపు లక్షల కోట్ల రూపాయల అప్పులు చుట్టుముడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయట పడేయాలో అర్థం కావట్లేదు.
అందుకనే ఉన్నతాధికారులతో, నిపుణులతో ఆలోచించిన తర్వాత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కొత్త ఆలోచన చేశారు. అదేమిటంటే విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించటం. ఇందులో భాగంగానే పాకిస్థాన్ లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. అదేమిటంటే శాశ్వత పౌరసత్వం ఇచ్చేస్తారట. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్లోని సంపన్నులపైనే ప్రధానమంత్రి దృష్టి పెట్టినట్లున్నారు.
ఆఫ్ఘన్ తాలిబన్ల వశం అయిన తర్వాత ఆ దేశంలోని చాలామంది సంపన్నులు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా లాంటి దేశాలకు వెళ్ళిపోయారు. అప్పటికే పై దేశాల్లో వాళ్ళు భారీ ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి దేశాన్ని విడిచి వెళ్ళిపోవటం సులభమైంది. అలాగే మరికొంతమంది సంపన్నులు మలేషియా, టర్కీల్లో పెట్టుబడులు పెట్టుకున్నారట. కాబట్టి కొందరు పై దేశాలకు వెళ్ళిపోయారు.
కాబట్టి పై దేశాలకు వెళ్ళిపోయిన వారినందరినీ తమ దేశంలో కూడా పెట్టుబడులు పెట్టమని ఇమ్రాన్ ఆహ్వానిస్తున్నారు. చైనీయులు, అమెరికన్లు, అమెరికాలో సిక్కులకు ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. పెట్టుబడిదారులు ఎవరైనా లాభాలను ఆశించే పెట్టుబడులు పెడతారని కొత్తగా చెప్పక్కర్లేదు. మరి పాకిస్ధాన్లో ఏముందని వచ్చి పెట్టుబడులు పెడతారు ? నిరంతరం అంతర్యుద్ధాలు, పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్థాన్ కు అంతర్జాతీయంగా ఉగ్రదేశంగా ముద్రపడింది. పెట్టుబడిదారులు ఎప్పుడూ వ్యాపార అవకాశాలు, విస్తరణను, లాభాలతో పాటు ప్రశాంతతను కోరుకుంటారు. మరి వీటిల్లో ఏముందని పాకిస్ధాన్ కు పెట్టుబడిదారులొస్తారు ?