పోర్న్ వీడియోలు పెడుతారా? దిగ్గజ క్రికెటర్ ఆగ్రహం

Update: 2020-05-29 14:01 GMT
ప్రస్తుతం మహమ్మారి దెబ్బకు అంతా లాక్ డౌన్ అయిపోయింది. అందరూ ఇంట్లో ఉండి కుటుంబంతో గడుపుతున్నారు. కొందరు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాతో ఆటలు ఆడుతూ హ్యాకింగ్ లు చేస్తూ సెలెబ్రెటీలతో ఆటలు ఆడుతున్నారు.

తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ అయ్యింది. అతడి ట్విట్టర్ ను హాక్ చేసిన దుండగులు అశ్లీల వీడియో క్లిప్ ను పోస్టు చేశారు. దీనిపై వకార్ యూనిస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన లాంటి సెలెబ్రెటీని అభాసుపాలు చేయడానికే ఇలా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినందున సోషల్ మీడియా నుంచి దూరం కావాలని వకార్ యూనిస్ నిర్ణయించుకున్నాడట.. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసి ఈ మొత్తం వ్యవహారంపై వకార్ యూనిస్ వివరించాడు. ఇకపై సోషల్ మీడియావైపు కన్నెత్తి చూడనన్నారు.

తన సోషల్ మీడియా ఖాతా హాక్ కావడం ఇదే మొదటిసారి అని.. ఈ వీడియో తన చివరి పోస్ట్ అని వకార్ యూనిస్ అభిప్రాయపడ్డారు. నన్ను ప్రజలతో అనుసంధానించే ఈ ట్విట్టర్ ను హ్యాక్ చేసి బూతు వీడియోలు పెట్టి నన్ను నా కుటుంబం పరువును నాశనం చేశారని వకార్ వాపోయాడు. ఇప్పటికే నాలుగుసార్లు హ్యాక్ చేశారని.. ఇక తాను సోషల్ మీడియాలో ఉండనని వకార్ స్పష్టం చేశాడు.
Tags:    

Similar News