ఉరీ ఉగ్రదాడి అనంతరం సర్జికల్ స్ట్రైక్స్ సంఘటనల తర్వాత పాకిస్థాన్ - భారత్ ల మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోయింది. పెరిగిపోయింది అనేకన్నా... ప్రస్తుతం వస్తోన్న కథనాల ప్రకారం ఇరుదేశాల మధ్య దాదాపు యుద్ధవాతావరణం నెలకొందని చెప్పవచ్చేమో. ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఒకెత్తు అయితే ఇరుదేశాల్లోని ప్రజలు - సంస్థల నిర్ణయాలు మరోఎత్తు! ఈ విషయంలో ఇప్పటికే భారత్ నుంచి పాక్ కళాకారులను తరిమేసే కార్యక్రమం అనధికారికంగా సక్సెస్ ఫుల్ గా నడిచిందనే చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో పాక్ కి భారత్ నుంచి పంపే కాయగూరలు - కారం - టమాటాలు మొదలైనవి రైతులు - వ్యాపారవేత్తలు స్వచ్చందంగా ఆపేశారు. ఇలా ఎవరి స్థాయిలో వారు పాక్ పై తమకున్న ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తోన్నారు.
అయితే తాజాగా పాకిస్థాన్ లో కూడా భారత్ కు సంబందించిన విషయాలపై నిషేదం విధించారు. ఇందులో భాగంగా భారత టీవీ - రేడియో కార్యక్రమాల ప్రసారాలపై సంపూర్ణ నిషేధం విధించాలని "పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ రెగ్యులేటరీ అథారిటీ" (పెమ్రా) నిర్ణయించింది. ఫెడరల్ ప్రభుత్వ సూచన మేరకు ఈ నెల 21 (శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలు) నుంచి ఈ నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఎవరైనా పెమ్రా నిర్ణయాలను కాదని ప్రసారం చేసినట్లు తెలిస్తే వారి లెసైన్సులు రద్దుచేస్తామని హెచ్చరించింది.
దీంతో పాకిస్థాన్ - భారత్ ల మధ్య పరిస్థితులు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, రాను రానూ ఎలా మారబోతున్నాయి అనే విషయానికి ఇది కూడా ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా ఈ నిషేధ వ్యవహారాలు భారత్ లో ఎక్కువగా ఉండగా, ధోనీ సినిమా విడుదలను పాక్ లో నిషేధిస్తూ నాడు అక్కడ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పాక్ నటులు నటించిన సినిమాల విషయంలోనూ భారత్ లో అదే పరిస్థితి నెలకొంది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/