కంచె దాటితే రూ.కోటి.. ఉగ్రవాదులకు పాక్

Update: 2016-12-12 11:46 GMT
సరిహద్దు ఆవల నుంచి ఇండియాలోకి పాక్ ఉగ్రవాదుల చొరబాట్లపై మన ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలు నిజమని మరోసారి నిరూపణ అయింది. ఈసారి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని నేతలే ఆ సంగతి వెల్లడించడం సంచలనంగా మారింది. పీఓకేకు చెందిన  అమన్ ఫోరం నేత సర్దార్ రయీస్ ఇంక్విలాబి తాజాగా పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.  నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి చొచ్చుకుని వచ్చే తీవ్రవాదులకు పాకిస్తాన్ కోటి రూపాయలను నజరానాగా ఇస్తోందని ఆయన ఆరోపించారు.

పాకిస్తాన్ మిలటరీ పోస్టుల ద్వారా తరుచూ సరిహద్దులో కాల్పుల నియంత్రణ ఉల్లంఘనకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తీవ్రవాదులు సరిహద్దు ప్రాంతాలో కాల్పులు జరుపుతూ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నారన్నారు.

పాక్ అండతోనే ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడుతున్నారని మన దేశం ఎప్పటినుంచో ఆరోపిస్తున్నా దాన్ని పాక్ ఖండిస్తూ వస్తోంది. అయితే.. పీఓకే నేతలు కూడా పాక్ ఎంతటి ఘోరాలకు పాల్పడుతుందో చెప్పడం ఇప్పుడు సంచనలంగా మారింది.
Tags:    

Similar News