పాకిస్థాన్ నేత.. తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు కొత్త కష్టం వచ్చి పడింది. ఇప్పటికే రెండో పెళ్లి వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన.. తాజాగా మరో భారీ కేసును ఎదుక్కొనే పరిస్థితి.
2013 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలను.. ఇమ్రాన్ చేశారు. ఆయన ఆరోపణలు చేసింది సాదాసీదా వ్యక్తి మీద కాదు. పాక్ మాజీ చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌదరిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా 20 బిలియన్ రూపాయిలకు తనకు పరువు నష్టం కలిగిందంటూ కోర్టు కేసు వేశారు.
రాజకీయ నేతగా చేసే ఆరోపణలపై ఇంత భారీగా పరువునష్టం ఏమిటని పాక్ రాజకీయ వర్గాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మాజీ చీఫ్ జస్టిస్ వేసిన కేసును విచారణకు అనుమతిస్తూ.. జనవరి 29న కోర్టు ముందుకు హాజరు కావాలంటూ ఇమ్రాన్‌కు తాఖీదులు అందాయి. మరి..ఈ వ్యవహారం చివరకు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.