మ‌న‌తో కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్‌

Update: 2016-12-29 14:08 GMT
నిత్యం క‌య్యానికి కాలు దువ్వేందుకు సిద్ధ‌మయ్యే పొరుగు దేశం పాకిస్తాన్ టోన్ మార్చి కాళ్ల బేరానికి వ‌చ్చింది. క‌శ్మీర్ స‌హా భార‌త్‌ తో నెల‌కొన్న అన్ని స‌మస్య‌ల‌ను స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో ప‌రిష్క‌రించుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు పాకిస్థాన్ వెల్ల‌డించింది. అయితే సింధు న‌దీ జ‌లాల ఒప్పందాన్ని మాత్రం ఏ దేశం ఏక‌ప‌క్షంగా ర‌ద్దు చేసుకోలేమ‌ని కూడా చెప్పింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి న‌ఫీజ్ జ‌కారియా మీడియాతో మాట్లాడుతూ ఈ మేర‌కు వెల్ల‌డించారు.

భార‌త్‌-పాకిస్తాన్‌ ల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ క‌శ్మీరే రెండు దేశాల మ‌ధ్య ప్ర‌ధాన స‌మ‌స్య అని, దీనిని ప‌రిష్క‌రించ‌డంలో అంత‌ర్జాతీయ స‌మాజం త‌న పాత్ర పోషించాల‌ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి న‌ఫీజ్ జ‌కారియా కోరారు. తాము మాత్రం అన్ని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం స్నేహ‌పూర్వ‌కంగా జ‌ర‌గాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. క‌శ్మీర్‌ లో భార‌త్ ఐక్య‌రాజ్య‌స‌మితి తీర్మాన ఉల్లంఘ‌న‌ల‌ను తాము ఖండిస్తున్న‌ట్లు న‌ఫీజ్ తెలిపారు. ఉరీ దాడి త‌ర్వాత సింధు న‌దీ జ‌లాల ఒప్పందాన్ని భార‌త్ పునఃస‌మీక్షించిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌పై స్పందిస్తూ.. ఈ ఒప్పందాన్ని ఏ ఒక్క దేశం మార్చ‌డంగానీ - ర‌ద్దు చేయ‌డంగానీ కుద‌ర‌ద‌ని  తేల్చి చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని గ‌మనిస్తూనే ఉంటామ‌ని, ఏవైనా ఉల్లంఘ‌న‌లు జ‌రిగితే తమ వ్యూహం ప్రకారం ముందుకెళ్తామ‌ని న‌ఫీజ్ అన్నారు. గ‌తంలోనూ ఆర్బిట్రేష‌న్ సాయంతో ఈ ఒప్పందంలో త‌లెత్తిన స‌మ‌స్య‌లు స్నేహ‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News