కుల భూష‌ణ్ కేసులో కొత్త ట్విస్ట్‌

Update: 2017-06-01 08:29 GMT
మ‌నోడు కుల్ భూష‌ణ్ ఉదంతాన్ని ప్రత్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. పాకిస్థాన్ చేసిన పాడు ప‌ని కార‌ణంగా ఇప్పుడ‌త‌ను  ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిపోయాడు. దేశం కాని దేశంలో అన్యాయంగా అరెస్ట్ చేసి పాకిస్థాన్‌ కు తీసుకెళ్లి.. తొండిగా మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించిన వైనంపై భార‌త్ తో పాటు.. ప‌లు దేశాలు స‌రికాద‌ని చెబుతున్నాయి. ఇదే విష‌యాన్ని అంత‌ర్జాతీయ కోర్టు సైతం చెప్పి.. అత‌ని ఉరిపై స్టే విధిస్తూ నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. అప్ప‌టి నుంచి.. కుల‌ భూష‌ణ్ ను భార‌త్ తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పాకిస్థాన్ సంచ‌ల‌న వ్యాఖ్యల్ని చేసింది.

త‌మ‌కు చెందిన మాజీ ఆర్మీ అధికారి లెప్టెనెంట్ క‌ల్న‌ల్ మ‌హ్మ‌ద్ హ‌బీబ్ జ‌హీర్‌.. క‌నిపించ‌టం లేదంటూ పాకిస్థాన్ ప్ర‌క‌టించింది. అత‌గాడి ఆచూకీ మీకేమైనా తెలుసా? అంటూ భార‌త్‌కు ఒక లేఖ రాసింది. జ‌హీర్ విష‌యానికి వ‌స్తే.. అత‌ను నేపాల్ లో ఏప్రిల్ 8 నుంచి క‌నిపించ‌టం లేద‌ని.. కిడ్నాప్ చేశారంటూ పాకిస్థాన్ చెబుతోంది. జ‌హీర్ ఎవ‌రో త‌మ‌కు తెలీద‌ని భార‌త నిఘా వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తుంటే.. పాక్ మీడియా మాత్రం అందుకు భిన్నంగా చిత్ర‌మైన వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చింది.

జ‌హీర్ ను అన్యాయంగా నేపాల్ లో కిడ్నాప్ చేశార‌ని.. ఇప్పుడ‌త‌ను రా ద‌గ్గ‌ర బంధీగా ఉన్న‌ట్లుగా పాక్ మీడియా వాదిస్తోంది. జాద‌వ్‌ ను విడిపించుకునేందుకు వీలుగా జ‌హీర్‌ ను భార‌త్ కిడ్నాప్ చేసింద‌న్న భావ‌నను పాక్ మీడియా చెబుతోంది. జ‌హీర్ గ‌తంలో పాక్ నిఘా సంస్థ‌లో ప‌ని చేశాడ‌ని.. ఆ త‌ర్వాత అత‌డికి నేపాల్ లోని ఐక్య‌రాజ్య‌స‌మితి కార్యాల‌యంలో ఉద్యోగం వ‌చ్చింద‌ని.. జాబ్‌ లో చేర‌టానికి నేపాల్‌ కు వెళ్ల‌గా.. భార‌త రా అధికారులు అత‌న్ని అదుపులోకి తీసుకొని ఉంటార‌ని చెబుతున్నారు. మ‌రీ విష‌యంలో భార‌త్  మాత్రం త‌మ‌కే విష‌యం తెలీద‌ని చెబుతోంది. అస‌లు నిజం ఏమిట‌న్న‌ది కాలం స‌రైన స‌మాధానం చెబుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News