పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యం కొనసాగుతోంది. ఓ వైపు శాంతిమంత్రం జపిస్తూనే మరోవైపు యుద్ధానికి రంకెలు వేస్తోంది. తామెప్పుడూ శాంతి మంత్రాన్నే జపించామని పాక్ మిలిటరీ అధికారి గఫూర్ తెలిపారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ - యుద్ధం చేసే సామర్థ్యం - సత్తువ రెండు దేశాలకు ఉన్నాయని - కానీ యుద్ధం అనేది ఓ విఫల విధానమని - ఇది భారత్ అర్థం చేసుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నేలపై యుద్ధం జరగకుండా చూసుకోవాలన్నారు. పాక్ సైనిక బలగాలు బలంగా ఉన్నాయని - కానీ తాము శాంతిని కాంక్షిస్తున్నామన్నారు. అంతర్జాతీయ సమాజం భారత్ - పాక్ మధ్య ఉన్న పరిస్థితిని అంచనా వేసేందుకు రావాలన్నారు. ఇవాళ భారత విమానాలు తమ గగనతలంలోకి రావడం వల్లే తిప్పికొట్టామని గఫూర్ తెలిపారు.
అయితే, పాక్ మిలిటరీ అధికారి ప్రకటన తర్వాత కొద్దిసేపటికే - పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేశారు. ఇవాళ ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ - భారత్ ను మరోసారి శాంతి చర్చలకు ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఒకవేళ భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడితే - తాము తిప్పికొట్టనున్నట్లు ముందే చెప్పానన్నారు. పుల్వామాలో దాడి జరిగిన తర్వాత .. భారత్ ను శాంతి చర్చలకు ఆహ్వానించామన్నారు. పుల్వామా దాడి పట్ల విచారణ చేపడుతామన్నారు. అయినా భారత్ దాడి చేస్తుందేమో అన్న ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు మా దేశంలోకి వస్తే - మేం కూడా మీ దేశంలోకి వస్తామని ముందే చెప్పామన్నారు. దానికి తగినట్లుగానే ఇవాళ మిగ్ 21 విమానాలను కూల్చేశామన్నారు. ఇక నుంచైనా మన విచక్షణతోనే ముందుకు వెళ్దామన్నారు. అన్ని యుద్ధాల్లో అంచనాలు తప్పాయన్నారు. మొదటి ప్రపంచ యుద్దం ఒక వారంలోనే ముగుస్తుందనుకున్నారు - కానీ ఆరేళ్లు అది సాగిందన్నారు. ఉగ్రవాదంపై యుద్ధం కూడా 17 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు.
``మీ దగ్గర ఉన్న ఆయుధాలు - మా దగ్గర ఆయుధాలు ఎన్ని ఉన్నాయో తెలుసా - మనం ఈ సమయంలో తప్పుగా యుద్ధ నిర్ణయం తీసుకోవచ్చా - యుద్ధం మొదలైతే - పరిస్థితి నా చేతిలో కానీ - భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో కానీ ఉండదు. పుల్వామా దాడితో ఎంత నష్టపోయామో మాకు తెలుసు - ఆ ఘటనలో మేం విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అంశంపై కూర్చుని మాట్లాడుకుందాం` అని అన్నారు.