దేశంలో జరిగే ఏ ఉగ్రవాద చర్యలకైనా పాకిస్థాన్ కారణమన్న విషయం దేశంలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. తాజాగా జమ్ముకాశ్శీర్ లోని ఉధంపూర్ లో పట్టుబడిన ఉగ్రవాది నావెద్ తన దేశానికి చెందిన వాడు కాదని.. అతని ఫోటోతో సరిపోలిస్తే దేశంలోని ఏ ఒక్కరితోనూ మ్యాచ్ కాలేదంటూ పాక్ సర్కారు పేర్కొనటం తెలిసిందే.
గతంలో ముంబయి కాల్పులకు తెగబడి.. పెద్ద ఎత్తు మారణహోమానికి కారణమైన కసబ్ విషయంలోనూ పాక్ ఇదే మాటను చెప్పింది. అయితే.. నావెద్ విషయంలో పాక్ పప్పులు ఉడకవని తేలిపోయింది.
అతగాడి తల్లిదండ్రులు.. ఫ్యామిలీ వివరాలు బయటకు రావటమే కాదు.. సీన్లోకి నావెద్ తండ్రి రావటంతో.. పాక్ బండారం ప్రపంచానికి తెలిసే పరిస్థితి. సదరు ఉగ్రవాది తమ దేశానికి చెందిన వాడు కాదని చెప్పినా.. అతడి తండ్రి యాకుబ్ ఖాన్ మాత్రం నావెద్ తన కొడుకేనని.. అతడ్ని కన్న దురదృష్టకర తండ్రిని తానేనని ఒప్పుకున్నాడు.
నావెద్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసిన మీడియా ప్రతినిధులు.. యాకూబ్ ఖాన్ వివరాలు అడగ్గా.. అతను భయపడిపోయినట్లు చెబుతున్నారు. తనకు పాకిస్థాన్ సైన్యం.. గూడాచార సంస్థ ఐఎస్ ఐ.. లష్కర్ ఎ తోయిబాతో తనకు ప్రాణహాని ఉందని వాపోతున్నాడు. దొంగమాటలతో బుకాయించాలని చూసిన పాకిస్థాన్ ఇప్పుడేం చెబుతుంది..?