ముగ్గురు భార్యలు.. 60 మంది పిల్లలు.. నాలుగో పెళ్లి రెడీ..!

Update: 2023-01-04 06:41 GMT
రాజుల కాలంలో భర్త ఒక్కడే గానీ ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండేవారు. అప్పట్లో మహిళల సంఖ్య ఎక్కువ కాగా పురుషుల సంఖ్య తక్కువగా ఉండేది. ఏ రాజ్యంలో ఎక్కువ జనాభా ఉండే ఆ రాజ్యానిదే యుద్ధ సమయాల్లో పైచేయిగా ఉండేది. కత్తులు కటార్లతో యుద్దం చేయాల్సి రావడంతో అప్పట్లో  జనాభా పెరుగుదల అవశ్యకంగా మారింది.

అందుకే నాడు నియామాలు గట్రా ఏమీలేవు. పెళ్లి విషయంలో మాత్రమే సుమ. రాజులు సైతం రాజ్యాలను జయించిన సమయంలో ఓడిపోయిన రాజు కుమార్తెను విహహం ఆడటమో.. లేదా సంధి చర్యల్లో భాగంగా ఇటువంటి తంతు కన్పించేవి. అయితే రాను రాను జనాభా పెరగడం.. కట్టుబాట్లు పెరగడం.. టెక్నాలజీ పెరగడంతో ఒక వ్యక్తికి ఒకే భార్య అనే కాన్సెప్ట్ వచ్చింది.

కొన్ని ముస్లిం దేశాల్లో ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురును నిఖా చేసుకున్నా పర్వాలేదు గానీ హిందు.. క్రిస్టియన్ దేశాల్లో మాత్రం కల్చర్ వేరేలా ఉంది.  భారత్ లో ఒక వ్యక్తికి ఒకే భార్య అని చట్టాలు చెబుతున్నాయి. విడాకులు తీసుకుంటే మాత్రం మళ్లి చేసుకోవచ్చు. ఇక క్రిస్టియన్ దేశాల్లో డేటింగ్ కల్చర్ వచ్చాక పెళ్లి కాన్సెప్టే కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చాయి.

అయితే ప్రస్తుతానికి మాత్రం అక్కడ కూడా ఒక వ్యక్తి లీగల్ గా ఒక భార్యను మాత్రమే చేసుకుంటున్నాడు. ఏది ఏమైనా మెజార్టీ భర్తలు మాత్రం ఒకే భార్య కాన్సెప్ట్ కే అలవాటు పడిపోయారు. వీరిలో ఎక్కువ శాతం ఒక్క భార్యతోనే వేగడం కష్టమనే భావనో లేదంటే వారిపై ప్రేమో ఏమో తెలియదు గానీ ఈ నిబంధనకు అలవాటు పడిపోయారు.

కాగా కొంతమంది మాత్రం ఒక భార్య ఉండగానే ముగ్గురు నలుగురిని పెళ్లాడుతున్నారు. సంసారం సుఖాన్ని అనుభవిస్తూ వన్ బై వన్ పిల్లలను కంటూ పోతున్నారు. ఇలాంటి వ్యక్తులు తరుచూ వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తూ అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇటీవల ఉగాండాకు చెందిన వ్యక్తి 12 మంది భార్యలు.. 100కు పైగా సంతానం 500 పైగా మనువడు.. మనవరాళ్లతో వార్తల్లో నిలిచాడు.

18 యేటే పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఏడాదికో భార్య పెంచుకుంటూ పోయాడు. అదే మాదిరిగా ఏకదాటిగా సంతానాన్ని పెంచుకుంటూ పోయాడు. 68 ఏళ్లు పైబడి ఆ వ్యక్తి ఇకపై పిల్లలు కనబోనని ప్రకటించడం గమనార్హం. తన ఆదాయం సరిపడినంతగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

తాజాగా పాక్ కు చెందిన సర్దార్ హజీ జాన్ మహమ్మద్(50) ఈ జాబితాలో చేరిపోయాడు. ఈ వ్యక్తి ముగ్గురు భార్యలతో ఏకంగా 60 మంది పిల్లలను కన్నాడు. వీరిలో ఐదుగురు పిల్లలు చనిపోగా 55 మంది బ్రతికి ఉన్నారు. అయితే ఈ వ్యక్తి 50 ఏళ్ళ వయస్సులో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు. తన భార్యలు మరింత మంది పిల్లలు కావాలని కోరుతున్నాడని మమ్మద్ చెప్పడం గమనార్హం. ఇక అతడి పెద్ద కూతురు వయస్సు 22 సంవత్సరాలు కావడం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News