నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ భారత్ మీద పడి ఏడవటమే పనిగా పెట్టుకునే పాకిస్థాన్ తాజాగా చేసిన పనితో ప్రపంచం మొత్తం మరోసారి నవ్వులపాలైంది. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా తాము కూడా ఏదో పొడిచేస్తామన్నట్లుగా ఫీలైపోయిన ఆ దేశం చేసిన పనితో ఇప్పుడు కిందామీదా పడుతోంది. తన తాజా చర్యతో భారత్ మీద పంచ్ వేయాలన్న కల కరిగిపోవటమే కాదు.. సెల్ఫ్ గోల్ వేసుకున్న చందంగా మారింది.
పాక్ అక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్.. బాల్టిస్థాన్.. ముజఫరాబాద్ లో వాతావరణ పరిస్థితుల్ని భారత వాతావరణ శాఖ పరిధిలోకి తీసుకోవటం.. తాజాగా ఆ ప్రాంతాల వాతావరణం గురించి సమాచారాన్ని ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించటం తెలిసిందే. ఇంతకాలంలో కేంద్రంలో పవర్ లో ఉన్న ప్రభుత్వాలకు.. మోడీ ప్రభుత్వానికి తేడా తెలియజేసే ఈ నిర్ణయంతో దాయాది ఉడికిపోయింది.
దెబ్బకు దెబ్బ తీయాలన్న వక్రబుద్ధిని ప్రదర్శించింది. మీరు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల వాతావరణ సమాచారాన్ని తెలియజేస్తే.. మేం కశ్మీర్ ప్రాంత వాతావరణ సమాచారాన్ని తెలియజేసేలా నిర్ణయం తీసుకున్నారు. పాక్ రేడియోలో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అడ్డంగా దొరికిపోయారు. తాజాగా పేర్కొన్న వాతావరణ సమాచారం ప్రకారం జమ్ముకశ్మీర్ లో చాలా ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయని.. వర్షం పడే అవకాశం ఉందని పాక్ రేడియ్ పేర్కొంది. లద్దాఖ్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత -4 అని.. కనిష్ఠ ఉష్ణోగ్రత -1గా పేర్కొనటం కామెడీగా మారింది.
మైనస్ విలువ పాక్ కు తెలీదంటూ వ్యంగ్యస్త్రాల్ని సంధించారు నెటిజన్లు. మైనస్ విలువను అర్థం చేసుకోవటంలో పడిన తికమక పాక్ ను నవ్వుల పాలయ్యేలా చేసింది. దీనిపై నెటిజన్లు దాయాదిని ఒక ఆట ఆడుకుంటున్నారు. -1 అనేది గరిష్ఠమని.. -4 అనేది కనిష్ఠమని పాక్ తెలుసుకోవాలని ఒకరు పేర్కొంటే.. పాక్ గరిష్ఠ స్థితి.. కనిష్ఠ ఐక్యూ తెలుస్తుందంటూ పంచ్ లు వేస్తున్నారు. అందుకే అంటారు.. కుళ్లుమోతుతనంతో వ్యవహరిస్తే ఇలాంటి తిప్పలే ఎదురవుతాయి మరి.