భారత్ నుంచి విడిపోయిన పాకిస్థాన్‌కు ఎప్పుడూ మనదేశంతో గొడవలు చికాకులు.. కశ్మీర్ అంశం సహా వివిధ వ్యవహారాల్లో ఇరు దేశాల మధ్య నిత్యం యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని భారత్ ఆరోపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇరు దేశాలు ఇక శాశ్వతంగా వైరి పక్షాలుగా ఉండావలిసిందేనా? శాంతి నెలకొనే అవకాశమే లేదా? అంటే కాదు అంటున్నాడు ఇంగ్లండ్ కు చెందిన మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోవిడ్ బారిన పడ్డాడు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇమ్రాన్ కోలుకోవాలంటూ ఓ ట్వీట్ పెట్టాడు.
అయితే ఇరు దేశాల మధ్య త్వరలోనే శాంతి నెలకొనే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కేవిన్ పీటర్సన్ ఓ ట్వీట్ పెట్టాడు. పాకిస్థాన్, భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడాలన్నదే తన కల అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే భారత్- పాకిస్థాన్ మధ్య తరుచూ యుద్ధ వాతావరణం ఉండటంతో ఇరుదేశాలు మధ్య క్రికెట్ టోర్నీలు కూడా జరగటం లేదు. కేవలం వరల్డ్ కప్ లాంటి క్రికెట్లు తప్ప .. సాధారణంగా ఇరుదేశాలు మధ్య క్రికెట్ సీరిస్ లు చాలా ఏళ్లుగా జరగడం లేదు. ఈ నేపథ్యం లో పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా అందరి కళ్లు తెరిపించింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరి నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సీరిస్ జరిగే అవకాశం ఉందన్న వాదన తెరమీదకు వస్తున్నది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సీరిస్ జరిగి ఎనిమిదేళ్లవుతుంది. 2012-13లో ఇరుజట్లు భారత్ వేదికగా తలపడ్డాయి. అదే ఆఖరు. ఆ సీరిస్ లో పాక్ వన్డే సీరిస్ ను కైవసం చేసుకున్నది. ఇరు జట్లు చెరో టీ20 గెలవడంతో టీ20 సిరీస్ డ్రాగా ముగిసింది. భారత్, పాక్ లు చివరిసారిగా 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ లో పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా 89 పరుగల తేడాతో(డక్‌వర్త్) పాక్ పై ఘనవిజయం సాధించింది.
ఐపీఎల్ 2022లో పాక్ ప్లేయర్స్ ఆడతారా?
ఐపీఎల్ తొలి ఎడిషన్ లో మాత్రమే పాక్ క్రికెటర్లు ఆడారు. ఆ తర్వాత ఎప్పుడూ పాక్ క్రికెటర్లు ఆడలేదు. కానీ ఐపీఎల్ లో ఆడాలని చాలా మంది పాక్ క్రికెటర్లు కోరుకుంటున్నారు. కానీ వాళ్ల ఆశ అడియాసగానే మిగిపోతున్నది. ఇదిలా ఉంటే 2022 ఐపీఎల్ సీజన్ లో పాక్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒక వేళ ఈ ఏడాది భారత్, పాకిస్థాన్ దేశాధినేతలు స్నేహపూర్వకంగా సమావేశమయితే పాక్ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది భారత్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ క్రికెటర్లు భారత్ కు రానున్నారు. ఆ తరువాత ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్ జరుగుతుందన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి.