దేశం చూపునే కాకుండా..పొరుగుదేశాలను సైతం తనవైపు తిప్పుకొన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సర్వశక్తులు ఒడ్డారు. పార్టీ - ప్రభుత్వం - హిందుత్వం - పొరుగుదేశాలతో సంబంధాలు...ఇలా అన్ని అంశాలను మోడీ వాడుకున్నారు. ఈ క్రమంలో గుజరాత్ లో బీజేపీని ఓడించేందుకు పాకిస్థాన్ జోక్యం చేసుకుంటుందని ప్రచార సభల్లో ఆయన అన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోడీ చేసిన ఈ కామెంట్స్ చివరి నిమిషంలో ఆయన పార్టీకి అనుకూలంగా మారాయనే అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా మోడీజీ విజయం సాధించారు. అయితే గుజరాత్ లో మోడీ విజయంపై పాక్ పత్రిక ఆసక్తికరమైన విశ్లేషణ చేసింది.
ఎన్నికల ప్రచారంలో పాక్ ప్రస్తావన మోడీ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పెద్దలు పాకిస్థాన్ తో గుజరాత్ ఎన్నికల గురించి చర్చించారని మోడీ తన ప్రచారంలో పేర్కొన్నారు. పాక్ నేతలతో జరిగిన సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ కూడా ఉన్నారంటూ మోడీ ఆరోపించారు. మాజీ ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ కూడా పాక్ తో గుజరాత్ ఎన్నికల అంశాన్ని చర్చించారని ఆరోపించారు. భారత్, పాక్‌కు చెందిన హై కమిషనర్లు కూడా ఆ సమావేశానికి హాజరైనట్లు మోడీ చాలా ఘాటైన ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ అస్ర్తాన్ని వాడడం వల్లే ప్రధాని మోడీ పార్టీ విజయం సాధించిందని డాన్ పత్రిక ఇవాళ తన కథనంలో పేర్కొంది. మోడీ విక్టరీకి పాక్ అస్త్రం పనిచేసిందని ఆ పత్రిక తన కథనంలో వివరించింది.
అసలు మోడీ పాక్ ప్రస్తావన వెనుక బ్యాక్ గ్రౌండ్‌ను కూడా డాన్ వివరించింది. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షిద్ మొహమ్మద్ కసూరి ఇటీవల ఢిల్లీకి వచ్చారు. రాంపూర్ - లోహ్రా రాయల్ కుటుంబం ఆహ్వానం మేరకు ఆయన ఓ పెళ్లికి హాజరయ్యారు. అయితే ఇదే సందర్భంలో బ్రిటన్‌కు చెందిన ఎన్జీఓ సంస్థ ఏస్పియన్ ఇన్స్‌టిట్యూట్ పాక్ మాజీ మంత్రికి ఆహ్వానం పంపింది. వాళ్లు ఆహ్వానితులకు డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్ కు క్యాంబ్రిడ్జ్ క్లాస్ మేట్ అయిన మణిశంకర్ అయ్యర్ కూడా హాజరయ్యారు. ఈ విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ - మాజీ ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ - పాక్ హైకమిషనర్ సోహెల్ మొహమ్మద్ లు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని మోడీ తన ఎన్నికల ప్రచార సభలో వాడుకున్నారు. గుజరాత్ ను ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు పాక్ తో చేతులు కలిపినట్లు మోడీ ఆరోపించారు. ఆ ఘాటైన ఆరోపణలతోనే బీజేపీ గుజరాత్ లో గట్టెక్కిందని డాన్ పత్రిక తన కథనంలో వెల్లడించింది. మోడీ తన మాటలతో గుజరాతీ ఓటర్లను ఆకర్షించడంలో సఫలమైనట్లు విశ్లేషించింది.