పాక్ నుంచి దావూద్ ను పంపేశారా...!

Update: 2015-08-24 07:16 GMT
అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ , 1993 ముంబై పేలుళ్ల సూత్ర‌ధారి దావూద్ ఇబ్ర‌హీంను దేశం దాటించేందుకు పాక్ ప్ర‌య‌త్నిస్తుందా? క‌రాచీలో మ‌హ‌రాజాలా భోగ‌భాగ్యాలూ అనుభ‌వించిన డాన్‌ను పాక్ ప్ర‌భుత్వం ఇప్పుడు అదే దేశంలోని ముర్రే అనే సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించిన‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్రకారం తెలుస్తోంది. అండర్‌‌‌‌‌‌‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌ లో ఉన్న‌ట్టు భార‌త నిఘా అధికారులు ప‌క్కా అథారాల‌తో నిరూపించారు. అలాగే దావూద్ లేటెస్ట్ ఫోటోలను విడుదల చేసి అతడ్ని తిరిగి భారత్‌‌‌ కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలు ఊపందుకోవడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడి..వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై దావూద్‌ ను కరాచీ లోని అతని ఇంటినుంచి ఉత్తర పాకిస్తాన్‌‌‌ లోని ‘ముర్రే’లో గల సురక్షిత ప్రాంతానికి ఐఎస్ ఐ, పాక్ సైన్యం ఆధ్వ‌ర్యంలో తరలించినట్టు స‌మాచారం.

 దావూద్ మీ దేశంలోనే దాక్కొన్నాడ‌ని.. ఆయ‌న‌కు మూడు పాస్‌ పోర్టులు ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న భార్య‌తో స‌హా  క‌రాచీలో ఉన్నాడ‌ని పేర్కొంటూ భార‌త్ పాక్‌ కు స్ప‌ష్టం చేయ‌డ‌మే కాక‌, అతడికి సంబంధించి తొమ్మిది ర‌హ‌స్య స్థావరాల‌కు చెందిన స‌మాచారాన్నీ దాయాది దేశానికి వివ‌రించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తమ వాహనంలో పాక్ సైన్యం దావూద్‌‌ ను మరో సురక్షిత ప్రాంతానికి తరలించిందని, ఇందుకు ఐఎస్ ఐ కూడా సహకరించిందని తెలుస్తోంది. సో..దావూద్ తమ దేశంలోనే లేడని పాపిస్తాన్ కాదు పాకిస్తాన్ ఇంత‌కాలం చెప్పిన మాట‌ల‌న్నీ.. బుకాయింపుల‌న్నీ బూట‌క‌మే అని తేలిపోయింది.

 ఇంత‌కాలం ఈ గ్యాంగ్ స్టర్ కరాచీ లోని క్లిఫ్టన్  ప్రాంతంలో..జియాదుద్దీన్ హాస్పిటల్ సమీపంలోని షిరీన్ జిన్నా కాలనీలో నివసిస్తున్నాడని, ఈ లొకేషన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో జర్దారీ ఇంటి దగ్గరలోనే ఉందని భారత ప్రభుత్వం స్పష్టం చేయ‌డంతో పాక్ సెల్ఫ్ డిఫెన్స్‌ లో ప‌డింది.దీంతో అత‌డిని తమ దేశ ర‌క్ష‌ణ ద‌ళాల నీడ‌లో సేఫెస్ట్ లొకేషన్‌‌‌ కు తరలించి త‌న బుద్ధి చాటుకుంది. బహుశా ముర్రే నుంచి కూడా అతడ్ని మరో ప్రాంతానికి తరలించవచ్చట‌! మ‌రోవైపు హోంశాఖ మాజీ కార్య‌ద‌ర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ మాత్రం దావూద్‌ ను ఇండియాకు ర‌ప్పించేందుకు ఇత‌ర మార్గాల‌ను అనుస‌రించాల్సిందేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ర‌హ‌స్య దాడుల ద్వారానే అత‌డిని ఇక్క‌డికి ర‌ప్పించ‌వచ్చ‌ని, ఇందుకు ప్ర‌ధాని మోడీ నుంచి భ‌ద్ర‌తా ద‌ళాల‌కు ప్ర‌త్యేక ఆదేశాలు జారీకావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అన్నారు.

  దాయాది దేశానికి దావూద్ ఇవాళ దేవుడు కావ‌చ్చు. కానీ.. అదే ఉగ్ర‌వాదం మృత్యుక్రీడ‌తో ఏనాటికైనా ముప్పు త‌ప్ప‌దు. నిజాలు దాచాల‌న్నా దాగ‌వు.. దాగుడు మూత‌లు చెల్ల‌వు.. ఈ వాస్త‌వం గుర్తెరిగి ప్ర‌వ‌ర్తిస్తే భార‌త్ - పాక్ సంబంధాలు పున‌రుద్ధ‌ర‌ణ‌కు నోచుకోగ‌ల‌వు. ఉమ్మ‌డిగా ఉగ్ర‌భూతాన్ని త‌రిమికొట్ట‌గ‌ల‌వు.అంతేగానీ.. దావూద్ లాంటి చీక‌టి సామ్రాజ్య నేత‌ల‌కు ప్ర‌త్యేక ర‌క్ష‌ణ క‌ల్పించినంత కాలం భార‌త్ కాదు క‌దా! ఉగ్ర‌వాదంపై పోరు సాగిస్తున్న ఏ దేశం కూడా.. పాక్‌ ను న‌మ్మ‌జాల‌దు. ఈ స‌త్యాన్ని పాక్ గుర్తెరిగితే మంచిది.
Tags:    

Similar News