పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఆ దేశ సుప్రీం కోర్టు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఆయన ఎన్నికల్లో పోటీ పడకుండా జీవిత కాల నిషేధం విధించింది. ఆయన ఇకపై ఏ రకమైన ఎన్నికల్లో పోటీ పడకూడదని.. ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే షరీఫ్ బహిరంగ సభలు కూడా పెట్టకూడదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 62 (1) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సుపీరం కోర్టు వెల్లడించింది. అవినీతి కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రకంపనలు రేపిన పనామా పేపర్ల కేసులో షరీఫ్ మీద కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు గత ఏడాది జులై 28న షరీఫ్ ను ప్రధాని పదవి నుంచి అభిశంసించింది. గతంలో సైన్యం చేతిలో వేటుకు గురైన షరీఫ్.. చాలా ఏళ్ల పాటు పాకిస్థాన్ కు దూరంగా ఉన్నాడు. లండన్ లో తలదాచుకున్నాడు. ఐతే తర్వాత పరిస్థితు మారడంతో తిరిగి స్వదేశానికి వచ్చాడు. గత ఎన్నికలకు ముందు పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాడు. తిరిగి ప్రధాని పదవి చేపట్టాడు. ఆయన నేతృత్వంలో మళ్లీ పాకిస్థాన్లో కొంచెం స్థిరత్వం వస్తోందని అనుకుంటుండగా పనామా పేపర్ల కేసు ఆయన మెడకు చుట్టుకుంది. ప్రస్తుత తీర్పు నేపథ్యంలో షరీఫ్ రాజకీయ జీవితం ముగిసినట్లే అని భావిస్తున్నారు. త్వరలోనే ఆయన జైలుకు వెళ్తాడని అంచనా వేస్తున్నారు.