భారత్ ను పీసీబీ బతిమిలాడేదేంది భయ్..?

Update: 2015-09-07 07:14 GMT
డబ్బుకు లోకం దాసోహం అని ఊరికే అనలేదేమో. భారత్ మీద నిత్యం బాంబులేస్తూ.. దేశ సరిహద్దుల్లో అశాంతిని రగిల్చేందుకు తెగ ప్రయత్నిస్తుండే విషయం తెలిసిందే. ఓవైపు బాంబులేస్తూనే మరోవైపు.. భారత్ కారణంగా వచ్చే కాసుల కోసం తెగ ట్రై చేస్తోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. భారత్ తో క్రికెట్ సీరిస్ అంటే కాసుల వర్షం ఎంతలా కురుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అసలే తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఉన్న పీసీబీకి.. భారత్ తో త్వరలో జరగాల్సిన సీరిస్ మీద చాలానే ఆశలు పెట్టుకుంది. అయితే.. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సిరీస్ భవితవ్యం మీద సందేహాలు నెలకొన్నాయి. దీంతో.. వచ్చిపడే డబ్బుల కట్టలు పోతున్నాయంటే ఎవరికి మాత్రం బాధ ఉండదు. అందుకే.. ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గతంలో మీరు మాతో ఒప్పందాలు చేసుకున్నారుగా? మళ్లీ ఇప్పుడు నో అంటారేంది? రాజకీయాలు వేరు.. ఆటలు వేరంటూ నంగి మాటలు మాట్లాడటం మొదలైంది.

భారత్ తో క్రికెట్ ఆడటం పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎంత అవసరమన్న విషయం తాజా బతిమిలాడటంతో తేలిపోవటంతో.. పాక్ లోని పలువురు మండిపడుతున్నారట. చేతిలో చిల్లిగవ్వ ఉండదు కానీ.. యుద్ధం అంటూ పెద్ద మాటలు మాట్లాడే పాకిస్థాన్ కు చెందిన అతివాదులకు భారత్ తో క్రికెట్ ఆడే విషయంలో పాక్ బోర్డు బతిమిలాడటం ఏ మాత్రం నచ్చటం లేదు.

అందుకేనేమో.. నాటి క్రికెటర్ మియాందాద్ ఈ అంశంపై పీసీబీ తీరును తప్పు పడుతున్నాడు. భారత్ ను మరీ అంతలా బతిమిలాడాల్సిన అవసరం లేదంటూ టెక్కు ప్రదర్శిస్తున్నాడు. ఈ సందర్భంగా భారత్ మీద తనకున్న ద్వేషాన్ని మియాందాద్ మరోసారి మాటల్లో వ్యక్తం చేశాడు. భారత్ ను దేబిరించాల్సిన అవసరం లేదని.. భారత్ కంటే పాకిస్థాన్ ఆటతీరులో ముందుంటుందని చెప్పిన అతగాడు.. క్రికెట్ కోసం ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా బతకటం చేతకాని తన దేశాన్ని.. దేశాధినేతల్ని ఏమీ అనలేని మియాందాద్ లాంటి అతివాది నోటి నుంచి ఇంతకుమించిన మాటలు ఏం ఆశించగలం..?
Tags:    

Similar News