పెళ్లికూతురి మెడలో టమోటాల హారం..ఎందుకంటే?

Update: 2019-11-21 09:49 GMT
పెళ్లి ..పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన అనుభవం. జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునేది పెళ్లి.  జీవితంలో తెలిసి చేసుకొనే అతి పెద్ద పండుగ ఈ పెళ్లి. దీనితో అందరూ తమకి తెలిసి బంధువులని - మిత్రులని పిలిచి అంగ రంగ వైభవం పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలాగే పెళ్లి అంటే బంగారం భారీ ఎత్తున కొనాల్సిందే. కానీ , తాజాగా పాకిస్థాన్ లోని లాహోర్ లో జరిగిన  పెళ్లి లో పెళ్లి కూతురు బంగారు హారానికి బదులుగా ..టమోటాలతో తయారు చేసిన హారాన్ని వేసుకుంది. అదేంటి ..పెళ్లి కూతురు అంటే పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు ధరించి ఉండాలి కదా ..టమోటాల హారం ఏమిటా ..అదేమైనా వారి ఆచారమా అని అనుకుంటున్నారా ..అది ఆచారం కాదు - గ్రహచారం కాదు. అసలు కారణం ఏమిటంటే ...

ప్రస్తుతం  ఆసియా దేశాల్లో ఉన్న పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోతుంది. ఇప్పటికే ఆ దేశం ఆర్ధికంగా చాలా చితికిపోయింది.  అక్కడి రూపాయి విలువ కనిష్టస్థాయికి  చేరింది.  ఈ నేపథ్యంలో పాక్ లో బంగారం కొనాలి అంటే మాములు విషయం కాదు. బంగారం ధరలు ఆకాశంలో ఉన్నాయి. సామాన్యులకు బంగారం కొనాలి అంటే సాధ్యం కాదు. ఇటీవల కాలంలో పాక్ లో  బంగారంతో పాటుగా టమోటా ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.  టమోటా కొనాలి అంటేనే భయపడేలా ధరలు పెరిగిపోయాయి. అక్కడ కిలో ధర ఎంతో తెలుసా రూ.300 పైమాటే.

ఇటువంటి సమయంలో లాహోర్ కు చెందిన ఓ యువతి పెళ్లి ఇటీవలే జరిగింది.  ఆ యువతి పెళ్లిలో బంగారం బదులుగా టమోటాలతో తయారు చేసిన ఆభరణాలను ధరించింది. లాహోర్ లోని ఓ లోకల్ ఛానల్ ఈ విషయాన్ని ప్రసారం చేయడంతో... ఒక్కసారిగా ఈ వార్తా వైరల్ అయ్యింది. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాకిస్థాన్ లో ఇప్పటివరకు బంగారం కొనలేని పరిస్థితుల్లో ఉన్నామని - ఇప్పుడు టమోటాలు కూడా కొనలేని పరిస్థితికి వచ్చేసాం అని ఆ యువతి  తెలిపింది. 
Tags:    

Similar News