పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రం జాకబ్ బాద్ లో దారుణం జరిగింది. పెళ్లి నాటి రాత్రే ఓ పందొమ్మిదేళ్ల వధువు భర్త చేతిలో హత్యకు గురయింది. ఎంతో వేడుకగా జరిగిన పెళ్లిలో అంతా ఆడిపాడి సంతోషంగా గడిపిన తరువాత అదే రోజు రాత్రి భర్త కలంధర్ బక్ష్ ఖోఖర్ పందొమ్మిదేళ్ల నవ వధువు ఖాన్ జాదీ లషారీని గొంతుకు తాడు బిగించి తమ గదిలోనే హత్య చేశాడు. అనంతరం ఆయన పారిపోయాడు.
ఇద్దరు సమీప బంధువులే కావడం, ఇద్దరూ ఇష్టపడడంతో వారికి వివాహం చేశారు. అయితే... పెళ్లి జరిగిన తరువాత ఆ రోజు రాత్రి భార్యపై అనుమానంతో కలంధర్ ఆమెను హతమార్చాడు. తన భార్య కన్య కాదన్న అనుమానంతో ఆమెను హతమార్చానని కలంధర్ పోలీసులకు చెప్పాడు.
అయితే.. యువతి కుటుంబసభ్యులు మాత్రం కలంధర్ మొదటి నుంచి విపరీత ప్రవర్తన గల వ్యక్తని చెబుతున్నారు. ఇద్దరూ ఇష్టపడడంతో పెళ్లి చేశామని... కానీ, ఇంత దారుణానికి ఒడిగడతాడని ఎన్నడూ ఊహించలేదని చెబుతున్నారు.