ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ... అనేది పాత పాట అయితే సోషల్ మీడియా ఎవరిని హీరోగా మార్చునో ఎవరూహించెదరూ అనేది నేటి మాట! రాజకీయాలు, సామాజిక అంశాలు, సినిమాలు.. విషయం ఏదైనా ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా పాత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇలా సోషల్ మీడియాలో తన ఫోటో ప్రమోట్ కావడం, ఆ ఫోటోపై ఎవరి స్థాయిలో వారు రకరకాల ఊహాగానాలు చేయడంతో నిన్నటివరకూ చాయ్ వాలా గా ఉన్న ఒక వ్యక్తి రాత్రికి రాత్రి మోడల్ గా మారిపోయాడు. అతను మరెవరో కాదు "చాయ్ వాలా" అర్షద్ ఖాన్.
ప్రస్తుతం అతను సోషల్ మీడియాకి వేలెవేల ధన్యవాదాలు చెబుతూ ఉన్నాడో ఏమో కానీ నిన్నటివరకూ చాయ్ అమ్మిన ఈ అర్షద్ ఖాన్ ఇప్పుడు మోడల్ గా మారిపోయాడు. రెండుమూడు రోజుల కిందటి వరకు ఇస్లామాబాద్ లోని ఇత్వార్ బజార్ లో చాయ్ అమ్ముతూ జీవనం సాగించిన అర్షద్ ఖాన్ తన ప్రమేయం లేకుండానే ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాడు. నీలికళ్ల ఓరచూపుతో చాయ్ కాస్తున్న అతని ఫొటో తీసిన జియా అలీ అనే ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ... భారత్ చేసిన సర్జికల్ దాడులకు పాకిస్థాన్ బదులు ఇదిగో అంటూ దాయాది దేశపు నెటిజన్లు అతని ఫొటోను తెగ షేర్ చేసుకున్నారు. ఇదే సమయంలో పీవోకేలో భారత్ సర్జికల్ దాడులకు ప్రతీకారంగా ఈ నీలికళ్ల కుర్రాడు భారతీయ అమ్మాయిలపై సర్జికల్ దాడులు చేస్తాడని, భారత్ పై పాకిస్థాన్ "అణుబాంబ్" ఇతడే అంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. దీంతో చాయ్ వాలా హ్యాష్ ట్యాగ్ పాకిస్థాన్ ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ స్థానంలో నిలిచింది. కట్ చేస్తే... ఒక ప్రముఖ ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్ కు మోడలింగ్ చేసే అవకాశం ఇతడిని వరించింది.
సోషల్ మీడియాలో ఇతని ఫోటో చూసిన ఫిటిఇన్.పీకే సంస్థ తన ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్ కు మోడలింగ్ చేసే అవకాశం వచ్చిందంటూ ఆ సంస్థ తన ఫేస్ బుక్ పేజీలో తెలిపింది. కోటు, సూటు ధరించిన అతని ఫొటోలను తాజాగా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఇక ఇతడి ఫ్లాష్ బ్యాక్ అండ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికొస్తే తన కుటుంబంలో 17మంది తోబుట్టవుల్లో అర్షద్ ఖాన్ ఒకడు. బ్రతుకు దెరువు కోసం చాయ్ అమ్ముతున్నాడు. అయితే ఈ విషయాలపై స్పందించిన అర్షద్... ఇప్పటివరకు ఒక 50 మంది వరకూ మహిళలు తనతో సెల్ఫీలు - వీడియోలు తీసుకొని వెళ్లారని, తాను ఇంతగా పాపులర్ కావడం ఆనందంగా ఉందని ఈ 18ఏళ్ల ఫ్యాషన్ వాలా చెబుతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/