పాకిస్తాన్ మాజీ ఫేస్ బౌలర్ షోయబ్ అక్తర్ బయోపిక్ గా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సినిమా రాబోతుంది అంటూ ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చింది. స్వయంగా అక్తర్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సినిమా కు సంబంధించిన ప్రకటనలు చేశాడు. మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు గతంలో సినిమా కు సంబంధించిన పలు విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
గత ఏడాది నవంబర్ 13న ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అక్తర్ చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యపరచుతోంది. తన బయోపిక్ తో అన్ని బంధాలు తెంచుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
తన బయోపిక్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ను కొనసాగించినా, తన పేరు ఉపయోగించి తన జీవితం లోని సంఘటనలను చిత్రంగా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటే హెచ్చరించారు. చాలా రోజుల పాటు పరిశీలించిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
రావల్పిండి ఎక్స్‌ప్రెస్ నుండి వైదొలుగుతున్నందుకు బాధగా ఉందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా కూడా దీని నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పంద ఉల్లంఘన జరగడంతో పాటు.. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడంలో చిత్ర యూనిట్ సభ్యులు విఫలమయ్యారు.
అందుకే నేను ఆ చిత్ర యూనిట్ సభ్యులతో బంధాన్ని తెంచుకుంటున్నాను. కనుక ఆ సినిమా ను ముందుకు తీసుకెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అక్తర్ హెచ్చరించాడు. ఇంతకు రావాల్పిండి ఎక్స్ ప్రెస్ మేకర్స్ లో విభేదాలకు కారణం ఏంటి అనేది మాత్రం తెలియరాలేదు.