భారత్ పై విషం చిమ్మేందుకు దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అన్వేషిస్తునే ఉంటుంది. భారత్ పై విద్వేషాన్ని ప్రదర్శించేందుకు అందివచ్చే ఏ ఒక్క అవకాశాన్ని కూడా పాకిస్థాన్ విడిచిపెట్టదని అందరికీ తెలిసిందే. భారత్ పై విషం చిమ్మటానికి, అంతర్జాతీయంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియాను ఎంచుకుంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్ సైట్లు, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర మాద్యమాల్లో 24 గంటలూ భారత్ వ్యతిరేకత వార్తలే ఉంటున్నాయి.
లడ్డాఖ్ లో చైనా సైన్యానికి సహకరించేందుకు ఉత్తర కొరియా సైన్యం చేరుకుందని ఒక వార్త కనబడుతుంది. జమ్మూ-కాశ్మీర్లో ఆర్టికల్ 371 రద్దు చేయటంతో పాటు దుర్వినియోగం చేసినందుకు భారత్ పై అమెరికా మండి పడిందని మరో వార్త కనబడుతుంది. 300 మంది భారతీయ గూఢచారులను తాలిబన్లు ఉరితీశారంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి వార్తల వెనుక అసలు ఉద్దేశ్యాలను అర్థం చేసుకోలేని జనాలు ఇవన్నీ నిజాలే అనుకుంటారు.
కానీ అసలు విషయం ఏమిటంటే పై వార్తలు, కథనాలన్నీ అన్నీ కల్పితాలే. కావాలనే భారత్ పై విషం చిమ్మటానికి నిరంతరం పాకిస్థాన్ ప్రేరేపిత శక్తులు చేస్తున్న దుష్ప్రచారం. అందుకనే ఇలాంటి సోషల్ మీడియాను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వాటిని మనదేశంలో కనబడకుండా నిషేధిస్తోంది. సరే వీటిని నిషేధిస్తే మరో రూపంలో మళ్ళీ కననబడతాయనటంలో సందేహంలేదు. కాబట్టి బారత్ వ్యతిరేక శక్తులు చేస్తున్న ఇలాంటి దుష్ప్రచారాలను 24 గంటలూ కనిబెడుతుండటానికే ప్రత్యేక వ్యవస్ధలు పనిచేస్తున్నాయి.
జమ్మూ-కాశ్మీర్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి బూతద్దంలో చూపించటమే పాకిస్తాన్ అసలు కుట్ర. ఎప్పుడో జరిగిన దాడులను, ఎప్పుడో జరిగిన ఎన్ కౌంటర్లను కూడా తాజా ఘటనలకు జోడించి భారత్ వ్యతిరేక ప్రచారం చేయటమే పాకిస్తాన్ అసలు ఉద్దేశ్యం. మన దేశ పౌరులనే మనదేశానికి వ్యతిరేకంగా తయారు చేయటం ద్వారా విధ్వంసాలను సృష్టించేందుకు పాకిస్తాన్ ఎప్పటినుండో ప్రయత్నిస్తోంది. ఈ విషయాలను సాక్ష్యాధారాలతో సహా మనదేశం నిరూపించినా దాయాది దేశం మాత్రం తన ప్రయత్నాలను మానుకోవటం లేదు.