ప్యాలస్ ఆన్ వీల్సు... భారతీయ రైల్వేలకే తలమానికమైన ఈ రైలు గత 34 సంవత్సరాలుగా ప్రపంచ పర్యాటకులకు సేవలందిస్తోంది. రాచమర్యాదలు - రాజరిక సౌకర్యాలు - హంగులు - ఆర్భాటలతో స్వర్గంలో ఉన్నామా అనిపించేలాంటి ఈ రైలు ప్రయాణానికి టిక్కెటు ధర రూ.2.50 లక్షల నుంచి మొదలవుతుంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్ల జాబితాలో దీనికి నాలుగో స్థానం లభించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలను ఆర్థిక మాంధ్యం ముంచెత్తిన 2008 సంవత్సరంలో కూడా ఈ రైలుసేవలు ఎన్నడూ ఆగలేదు. కానీ, ఏప్రిల్ నెలలోని తాజా ట్రిప్ మాత్రం ప్రయాణికులు లేకపోవడంతో ఆగిపోయింది. కేవలం 104 మందికే అవకాశముండే ఈ ప్రయాణంలో కనీసం 25 మంది ఉంటేనే రైలు నడుపుతారు. అయితే... ఇంతవరకు ఎన్నడూ 25 కంటే తక్కువ మంది ప్రయాణికులున్న సందర్భం లేనేలేదు. ఈసారి మాత్రం కనీస ప్రయాణికుల సంఖ్యను అందుకోలేకపోవడంతో ట్రైను నడపలేదు.
అద్భుత ఆతిథ్యంతో 7 రాత్రులు - 8 పగళ్ల పాటు జైపూర్ - ఉదయ్ పూర్ - జైసల్మేర్ - జోధ్ పూర్ ప్రాంతాల్లో పర్యటిస్తూ, టూరిస్టులకు స్వర్గాన్ని చూపించే రైలు ఇది.. 1982లో ఈ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఒక ట్రిప్ లో కేవలం 104 మందికి మాత్రమే దీనిలో చోటు ఉంటుంది. ప్యాలెస్ ఆన్ వీల్సు చరిత్రలో టూరిస్టులు రైలెక్కేందుకు రాకపోవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. అయితే... ఎప్పుడూ లేనిది ఎందుకిలా ప్రయాణికులు రాలేదో మాత్రం అధికారులు చెప్పలేకపోతున్నారు.