తెహ‌ల్కా సంచ‌ల‌న ఇంట‌ర్వ్యూ..త‌మిళ‌నాడులో క‌ల‌క‌లం!

Update: 2019-01-12 06:54 GMT
సంచ‌ల‌నాల‌కు కేంద్రంగా ఉంటూ.. షాకింగ్ క‌థ‌నాల్ని తెర మీద‌కు తెచ్చే ప్ర‌ముఖ మీడియా సంస్థ తెహ‌ల్కా మ‌రో సంచ‌లనానికి తెర తీసింది. త‌మిళ‌ప్ర‌జ‌ల‌కు అమ్మ అయిన జ‌య‌ల‌లిత ఎస్టేట్‌కు చెందిన మిస్ట‌రీ మ‌ర్డ‌ర్ల‌కు సంబంధించిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తోకూడిన ఒక ఇంట‌ర్వ్యూను తాజాగా విడుద‌ల చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. అధికార అన్నాడీఎంకేకు ముచ్చ‌మ‌ట‌లు పోయిస్తున్న ఈ వీడియోపై వారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంత‌లా త‌మిళ‌నాడు అధికార‌ప‌క్షం ఆగమాగం కావ‌టానికి ఆ వీడియోలో ఏముంది?  ఎందుకింత సంచ‌ల‌నంగా మారింద‌న్న‌ది చూస్తే.. అమ్మ‌కు చెందిన ప‌లు ఎస్టేట్స్ ఉన్న విష‌యం తెలిసిందే. వాటిల్లో అమ్మ‌కు అత్యంత ఇష్టంగా చూసుకునే వేస‌వి విడిది కేంద్రం నీల‌గిరి జిల్లాలోని కొడ‌నాడు ఎస్టేట్‌. ఇక్క‌డ సేద తీర‌టం అమ్మ‌కు చాలా ఇష్టంగా చెబుతారు.

అనారోగ్యంతో అమ్మ మ‌ర‌ణించిన త‌ర్వాత ఆమె ఆస్తుల్ని బాధ్య‌త‌గా చూసుకున్న వారే లేరు. ఎవ‌రికి వారు.. అందిన కాడికి త‌మ సొంతంగా మార్చుకున్న‌ట్లుగాఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. కొడ‌నాడు ఎస్టేట్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద ఎత్తున అనుమానాస్స‌ద మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్టేట్ ను దోచుకోవ‌టానికి ప్ర‌య‌త్నించిన వైనం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే.

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత వ‌రుస‌గా దోపిడీలు.. ఆ త‌ర్వాత  అనుమాన‌స్ప‌దంగా ఉన్న వారు ఒక్కొక్క‌రుగా  మ‌ర‌ణించ‌టం.. కొంద‌రు సూసైడ్లు చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇదంతా నిజం కాద‌ని.. అనుమానాస్ప‌దంగా న‌మోదైన మ‌ర‌ణాల వెనుక పెద్ద కుట్ర ఉంద‌ని.. దీనికి ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి హ‌స్తం ఉన్న‌ట్లుగా ప్ర‌ధాన నిందితుడు ఒక‌రు ఒప్పుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.

కేర‌ళ‌కు చెందిన స‌యాన్ కొడ‌నాడు ఎస్టేట్ లో ఉండేవాడు. ఇత‌గాడు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌యాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావ‌టం.. ఇత‌డు త‌ప్పించి మిగిలిన వారు మ‌ర‌ణించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న్ను ఆసుప‌త్రికి చేర్చారు.

తెహ‌ల్కా మాజీ ఎడిట‌ర్ మాథ్యూ సంచ‌ల‌న ఇంట‌ర్వ్యూ చేశారు. ఇందులో కొడ‌నాడు ఎస్టేట్‌కు సంబంధించిన ప‌లు అంశాల్నిబ‌య‌ట‌పెట్టారు. తెహ‌ల్కాకు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో అనుమాన‌స్ప‌ద మ‌ర‌ణాల వెనుక సీఎం ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేయ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తెహ‌ల్కాకు న‌యాన్ చెప్పిన విశేషాలు చూస్తే.. కొడ‌నాడును దోచుకునేందుకు సీఎం ఎడ‌ప్పాడి ప‌ళినిస్వామి ప్ర‌మేయం ఉన్నట్లుగా న‌యాన్ చెబుతున్నారు. మ‌రోవైపు న‌యాన్ మీద డీఎంకే నేత ముబార‌క్ మాట్లాడుతూ.. ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఇదిలా ఉంటే తెహ‌ల్కాకు స‌యాన్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించ‌టం ద్వారా సంచ‌ల‌నం సృష్టించారు.

కొడ‌నాడు ఎస్టేట్ లో ఈ మ‌ధ్య‌న ప‌లు అనుమాన‌స్ప‌ద మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి. వాటి వివ‌రాల్లోకి వెళితే.. కొడ‌నాడు ఎస్టేట్‌లో జ‌రిగిన దోపిడీ వేళ‌.. కాప‌లాదారు మ‌ర‌ణించారు. అదే స‌మ‌యంలో ఎస్టేట్లో సీసీ టీవీ ఫుటేజ్ లు ప‌రిశీలించిన యువ‌కుడు మ‌ర‌ణించాడు. ఈ కేసులోకీల‌క నిందితుడు సైతం అనుమాన‌స్ప‌ద రీతిలో మ‌ర‌ణించారు. ఇలా వ‌రుస పెట్టి మ‌రీ మ‌ర‌ణిస్తున్న వైనం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ఇలాంటి వేళ స‌యాన్ చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌తో త‌మిళ‌నాడు ఉలిక్కి ప‌డింది. సంచ‌ల‌న మిస్ట‌రీగా మారిన వ‌రుస ప్ర‌మాదాల‌తో సీఎం హ‌స్తం ఉంద‌న్న మాట ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది. అయితే.. ఈ క‌థ‌నంపై తాము న్యాయ‌పోరాటం చేయ‌నున్న‌ట్లుగా అన్నాడీఎంకే మంత్రి ఒక‌రు వెల్ల‌డించారు. కోర్టుల‌కు వెళ్ల‌టం త‌ర్వాత‌.. కొడ‌నాడు మ‌ర‌క ప‌ళ‌నిస్వామి ప్ర‌భుత్వాన్ని ఏం చేస్తున్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది.




Full View
Tags:    

Similar News