పొరుగున ఉన్న తమిళనాడుతో మరమారు ఆంధ్రప్రదేశ్ కు పొరాపొచ్చాలు తెరమీదకు వచ్చాయి. చిత్తూరు జిల్లా మీదుగా ప్రవహిస్తూ తమిళనాడులోకి ప్రవేశించే కుశస్థలి నది పాయ వద్ద చెక్ డామ్ నిర్మాణం విషయంలో తమిళనాడులోని విపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో ఏపీ ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మించ తలపెట్టినట్టు తన దృష్టికి వచ్చిందని లేఖలో పళనిస్వామి పేర్కొన్నారు. ఏపీ-తమిళనాడులో ప్రవహించే ఈ నది అంతరాష్ట్ర నది అని ఆయన తెలిపారు.
చిత్తూరు జిల్లా మీదుగా ప్రవహిస్తూ తమిళనాడులోకి ప్రవేశించే కుశస్థలి నది పాయ వద్ద చెక్ డామ్ నిర్మాణం ఆపాలని పళనిస్వామి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కుశస్థలి నది నీటితో తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వందలాది ఎకరాల సాగు జరుగుతోందని తమిళనాడు పళనిస్వామి వెల్లడించారు. ఈ క్రమంలో ఈ నదిపై ఏపీ చెక్ డ్యామ్ కట్టడం వల్ల తమిళనాడు రైతులు నష్టపోతారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నదిపై చెక్‌డ్యామ్ నిర్మించడాన్ని ఆపాలని ఆయన చంద్రబాబును కోరారు.
మరోవైపు పాలారులో చెక్ డ్యాం నిర్మించాలనే డిమాండ్ ను పరిశీలించనున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో జలవనరులను పెంచేందుకు పాలారు నదిలో చెక్‌డ్యాం నిర్మించాలనే డిమాండ్ ను సభలో సభ్యులు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ అంశాన్ని పరిశీలించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని పలు సమస్యల గురించి ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు డిల్లీ వెళ్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు, అవసరమైన నిధులు పొందేందుకు డిల్లీ పర్యటన చేపడుతున్నానని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టు విషయం వివరించనున్నట్లు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/