బాలయ్యను ప్రశ్నించే ధైర్యం ఉందా? ఏపీ మంత్రి

Update: 2017-01-28 06:38 GMT
హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ నటించిన చారిత్రక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణికి ఏపీ ప్రభుత్వం వినోద పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పుడే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ తాజాగా జీవో జారీ చేశారు. శాతకర్ణికి తెలుగు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉండడం.. ఏపీ నూతన రాజధాని అమరావతి ప్రాంతంతో సంబంధం ఉండడంతో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చినట్లు ఏపీ సమాచార, ప్రసారాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పుకొచ్చారు.
    
అయితే.. మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకున్నప్పుడు తొలుత ఏకాభిప్రాయం కుదురలేదని టాక్. దీనిపైనే మంత్రిని మీడియా ప్రశ్నించింది. అందుకు ఆయన సమాధానమిస్తూ.. మంత్రివర్గంలో వ్యతిరేకతేమీ రాలేదు. బాలయ్యను వ్యతిరేకించే ధైర్యం, ప్రశ్నించే ధైర్యం ఎవరికైనా ఉందా?  అంటూ సరదాగా అన్నారు .  సో... సీఎం బామ్మర్ది హోదాలో బాలయ్య నటించిన సినిమాకు వినోద పన్ను మినహాయింపు ప్రతిపాదనను అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయలేదన్నమాట.
    
కాగా.. గతంలో గుణశేఖర్ తీసిన రుద్రమ దేవి సినిమాకు పన్ను మినహాయింపు కోరుతూ ఆయన అభ్యర్థన పెట్టుకోగా ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. కానీ.. శాతకర్ణికి మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అనేశారు. దీంతో గుణశేఖర్ రీసెంటుగా ఏపీ సీఎం చంద్రబాబుకు దీనిపై లేఖ కూడా రాశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News