సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వచ్చే నవంబర్ లోనే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికలు ఎన్నో ఆసక్తికర సమరాలకు వేదికవుతున్నాయి. పార్టీలు గెలవడం కోసం కుటుంబ సభ్యుల మధ్య చిచ్చుపెడుతున్నాయి. కుటుంబ సభ్యులనే బరిలోకి దింపుతూ రాజకీయవేడి రగిలిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఓ అన్నా చెల్లెలు మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది.
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతగా ఓ వెలుగు వెలిగారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయనకు తిరుగుండేదికాదు.. కానీ 2014లో పాల్వాయి చనిపోయాక ఆయన కూతురు పాల్వాయి స్రవంతిరెడ్డి తండ్రి స్థానంలో రాజకీయల్లోకి దిగారు. పాల్వాయి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోయినసారి పోటీచేసి ఓడిపోయారు. మునుగోడులో పాల్వాయికి గట్టి పట్టుండేది. ఆయన అక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గడిచిన ఎన్నికల్లో తండ్రి స్థానంలో స్రవంతి రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ సీపీఐతో పొత్తు కారణంగా కాంగ్రెస్ ఈ సీటును సీపీఐకి కట్టబెట్టింది. దీంతో స్రవంతి రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గెలిచిన టీఆర్ ఎస్ అభ్యర్థి తర్వాత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటారు.
ఈసారి మాత్రం గెలుపు పక్కా అని స్రవంతి రెడ్డి మునుగోడులో ప్రచారంతో పక్కాగా ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ తనకు పక్కాగా టికెట్ ఇస్తుందని నమ్మకంగా ఉన్నారు. అయితే అసమ్మతులను - ప్రముఖులను లాక్కొని సీట్లు ఇచ్చి నిలబెడుతున్న బీజేపీ అధిష్టానం తాజాగా మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పాల్వాయి రవిచరణ్ ను దింపేందుకు ఒప్పించిందట.. ఆయన హైదరాబాద్ లో ప్రముఖ ఈఎన్టీ వైద్యులు. స్వయానా స్రవంతిరెడ్డికి కజిన్ బ్రదర్. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నో సార్లు ప్రజలకు వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో ఈయనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా బీజేపీ అధిష్టానం బరిలోకి దింపుతోంది. దీంతో ఈ సోదరీ-సోదరుడి మధ్య బీజేపీ చిచ్చుపెట్టినట్టైంది.
అయితే ఈ అన్నాచెల్లెల్ల సమరంలో అంతిమంగా ప్రస్తుత సిట్టింగ్ మునుగోడు ఎమ్మెల్యే కాసుకుంట ప్రభాకర్ రెడ్డికి మేలు జరిగిలే ఉంది. అసమ్మతి - వ్యతిరేక ఓట్లను వీరు చీల్చితే మిగతా ఓట్లన్నీ తనకు పడి గెలుస్తానని ఆయన నమ్మకంతో ఉన్నారు. కేసీఆర్ స్ట్రాటజీ - ప్రభుత్వ పథకాలతోపాటు ఈ అన్నాచెల్లెలు నిలబడితే ఓట్ల చీలికతో తనే గెలుస్తానని కాసుకుంట ధీమాగా ఉన్నారు.