సీరియస్ రాజకీయాల్లో బిజీగా ఉండే వారు హీరోగా నటించటం లాంటివి కనిపించవు. ఆ కొరత తీరేలా ఒక మూవీ నిర్మిస్తుండటం.. అది కాస్తా పాన్ ఇండియా సినిమా కావటం విశేషం. ఇంతకీ ఆ రియల్ పొలిటికల్ లీడర్ ఎవరో కాదు మాల మహానాడుకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్.
కోదండరామ్ కు చెందిన టీజేఎస్ కు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆయన 2014 ఎన్నికల వేళ ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోయారు. 2018లో కూడా తుంగతుర్తి నుంచి పోటీ చేసి రెండు వేల ఓట్ల తేడాతో మళ్లీ ఓడారు.
అధికార పార్టీ మీద అవకాశం చిక్కిన ప్రతిసారీ విరుచుకుపడే ఆయన.. హీరోగా నటిస్తున్న మూవీకి హీరోయిన్ గా సీనియర్ నటి ఇంద్రజ నటిస్తున్నారు. ఈ సినిమాలో అద్దంకి దయాకర్ పోషించే పాత్ర పేరు కూడా దయాకరే కావటం గమనార్హం. ఈ మూవీ కథ సెమీ బయోపిక్ గా ఉంటుందని చెబుతున్నారు.
ఈ సినిమాకు మేరా భారత్.. జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నాలుగు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబరు చివరకు పూర్తి కానుంది. ఈ మధ్యనే గాంధీ భవన్ లోనూ షూట్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో గాంధీ భవన్ లో ఆయన ప్రెస్ తో మాట్లాడే సీన్లను షూట్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తారని చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇంతకీ ఈ చిత్ర కథేమిటన్న విషయాన్ని మూడుముక్కల్లో చెప్పాలంటే.. బయోవార్.. దేశాల మధ్య నెలకొన్న వివాదాలతో ఉంటుందని చెబుతున్నారు. పాట.. ఫైట్లు కూడా ఈ మూవీలో ఉండనున్నాయి. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఈ సినిమాలో ప్రజా గాయకుడు గద్దర్..టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ దాసోజు శ్రవణ్ కూడా నటించారు. మొత్తంగా ఒక రాజకీయ నాయకుడు హీరోగా ఒక సీరియస్ మూవీ రానుండటం ఆసక్తికరంగా మారింది. మరీ.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.