ఆమె మ‌ళ్లీ సైలెంట్.. ఇలాంటి నేత‌ల‌తో బాబు అధికారంలోకి వ‌స్తారా?

Update: 2021-09-25 02:30 GMT
టీడీపీలో ఇప్పుడు ఈ చ‌ర్చ సాగుతోంది. నాయ‌కులు పార్టీకి ప్ల‌స్ అవ్వాలే త‌ప్ప‌.. నాయ‌కుల‌కు పార్టీ ప్ల‌స్ అయ్యే ప‌రిస్థితి రాకూడ‌దు. కానీ, చిత్రం ఏంటంటే.. ఇటు చంద్ర‌బాబు ఇలాంటి వారిని నిల‌దీయ లేక పోవ‌డం.. అటు నాయ‌కులు కూడా పార్టీని వాడుకుని వ‌దిలేయ‌డం.. స‌హ‌జ ప్ర‌క్రియగా మారిపోయింది. ఈ దుస్థితి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు చేసేలా చేస్తోంది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పిన నాయ‌కురాలు.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీ చేరారు.. ప‌న‌బాక ల‌క్ష్మి. ఆ ఎన్నిక‌ల్లో ఆమెకు.. వ‌చ్చీరావ‌డంతోనే చంద్ర‌బాబు తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఇచ్చారు.

ఎస్సీ మ‌హిళ‌, ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం వంటివి మాత్ర‌మే ఆమెకు అప్ప‌ట్లో ప్ల‌స్ అయ్యాయి. వాస్త‌వానికి వ‌ర్ల రామ‌య్య తిరుప‌తి నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. కానీ, ఆర్థిక ప‌రిస్థితి చూసి.. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. ప‌న‌బాక‌ను నెత్తిన పెట్టుకున్నారు. ఆమె.. జ‌గ‌న్ సునామీతో ఓడిపోయారు. ఇక‌.. అప్ప‌టి నుంచి దాదాపు రెండేళ్ల పాటు.. పార్టీలో క‌నిపించ‌లేదు. ఇక‌, దీనికి తోడు..ఆమె వైసీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నార‌ని.. టీడీపీలోనే చ‌ర్చ సాగింది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో ఉన్న ప‌రిచ‌యాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌ను ఈ కుటుంబాన్ని చేర్చుకుంటార‌ని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆమె మౌనంగా ఉండిపోయారు.

ఇక‌, మ‌ళ్లీ చంద్ర‌బాబు ఆమెకు ఇటీవ‌ల జ‌.రిగిన తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో పిలిచి పిల్ల‌నిచ్చిన ట్టుగా టికెట్ ముందే ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే మ‌ళ్లీ జెండా ప‌ట్టుకున్న ప‌న‌బాక‌.. ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసుకున్నారు. చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌చారం చేశారు. అయితే.. తిరుప‌తి బై పోల్‌లో మ‌ళ్లీ ప‌రాజ‌యం వెంటాడింది. పోనీ.. ఆ త‌ర్వాత అయినా.. ఆమె యాక్టివ్ అయ్యారా? అంటే.. అదీ లేదు. క‌నీసం ఇప్పుడు పార్టీకి మొహం కూడా చూపించ‌డం లేదు. పార్టీపై ప్రేమ‌ను ప‌క్క‌న పెట్టినా.. త‌న కోసం.. క‌రోనాను సైతం లెక్క‌చేయ‌కుండా.. వారం రోజుల పాటు తిరుప‌తిలోనే మ‌కాం వేసి ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబుపై కూడా ఆమె కృత జ్ఞ‌త చూపించ‌లేద‌ని.. పార్టీ వ‌ర్గాలు పెద‌వి విరుస్తున్నాయి.

ఇక‌, ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీఈ యాక్టివ్ అయి.. పార్టీ జెండా ప‌ట్టుకున్నా.. ప‌న‌బాక వెంట న‌డిచే కార్య‌క‌ర్త‌లు, కేడ‌ర్ ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు., అప్పుడు కూడా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప‌నిగ‌ట్టుకుని.. ప‌న‌బాక కోసం రంగంలోకి దిగాల్సి ఉంటుంది. కానీ, కేడ‌ర్ లో మాత్రం తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది. ఓట‌మి పొందినంత మాత్రాన త‌మ‌ను ప‌ట్టించుకోక‌పోతే ఎలా అనేది కేడ‌ర్ మాట‌. దీంతో ఇప్పుడు ప‌న‌బాక వ‌చ్చినా.. మ‌ళ్లీ టికెట్ ఇచ్చినా.. ఊరుకునేది లేద‌ని.. ఓ వ‌ర్గం నాయ‌కులు తెగేసి చెబుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏంచేస్తారో చూడాలి.
Tags:    

Similar News