తిక్క‌రేపుతున్న టీడీపీలో మ‌హిళా నేత రాజకీయం..!

Update: 2022-01-24 23:30 GMT
ఇదేం రాజ‌కీయం త‌ల్లో! అంటున్నారు ఆ మ‌హిళా నేత‌ను ఉద్దేశించి.. టీడీపీ నేత‌లు. ఎన్నిక‌లు వ‌స్తేనే ముందుకు వ‌స్తున్నారు. త‌ర్వాత‌.. ఇంటికే ప‌రిమిత‌మై పోతున్నారు.. పైగా చంద్ర‌బాబు స్వ‌యంగా పోన్ చే సి.. రండి.. ఈ రోజు ధ‌ర్నా ఉంది! అని స్వ‌యంగా పిలిచినా.. కాళ్లు నొప్పులు సార్.. అని ఆమె త‌ప్పించుకు న్నార‌ట‌. దీంతో ఆమె విష‌యం పార్టీలో ఆస‌క్తిగా మారింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి. 2019లో టీడీపీ త‌ర‌ఫున తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆమెసైలెంట్ అయిపోయారు.

మ‌ళ్లీ ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌రిగిన గ‌త ఏడాది మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చారు. మ‌రోసారి ఓడిపోయారు. అయితే .. మ‌ళ్లీ ఆమె ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అది కూడా ఢిల్లీలో ఉంటున్నార‌ట‌. అదేమంటే...త‌న‌కు ఆరోగ్యం బాగోలేద‌ని.. తిర‌గలేక‌పోతున్నాన‌ని.. కాళ్లు నొప్పులు వ‌స్తున్నాయ‌ని ఆమె చెబుతున్నార‌ట‌. వాస్త‌వానికి కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన ఆమెకు చంద్ర‌బాబు ఎంపీ టికెట్ ఇచ్చారు. మ‌రోసారి కూడా ఉప ఎన్నిక‌లోనూ ఎంపీ టికెట్ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ రిజ‌ర్వ్ చేసుకున్నార‌ని అంటున్నారు. కానీ, పార్టీలో మాత్రం ఆమె ఊసు ఎక్క‌డా వినిపించ‌డం లేదు.

క‌నీసం . ఓడిపోయిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వర్గంలోనూ ఆమె కనిపించ‌లేదు. పోనీ.. పార్టీలో అయినా.. యాక్టివ్‌గా ఉన్నారా? అంటే... అది కూడా లేదు. దీంతో చంద్ర‌బాబు స్వ‌యంగా ఫోన్ చేసి.. ఇటీవ‌ల ఆమెతో మాట్లాడార‌ని తెలిసింది. అయితే... ఆమె తాను ఢిల్లీలో ఉన్నానని త్వ‌ర‌లో వ‌స్తాన‌ని.. కాళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని చెప్పార‌ట‌. దీంతో ఈ విష‌యం ఆనోటా ఈనోటా.. పార్టీల‌లో అంద‌రికీ చేరిపోయింది. దీంతో ఇలాంటినేత అవ‌స‌రం మ‌న‌కు ఉందా? అని నాయ‌కులు చెబుతున్నారు.

కానీ, మ‌హిళాసెంటిమెంటుకు ప్రాధాన్యం ఇచ్చే చంద్ర‌బాబు మాత్రం ఇలాంటివారిని వ‌దులుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. దీంతో ఇలాంటి వారి వ‌ల్ల పార్టీ కి ప్ర‌యోజనం లేద‌ని.. వీరిని వ‌దిలించుకోవా ల‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి. కానీ, ఇప్ప‌ట్లో ఇది సాధ్యం కాద‌ని తెలిసిపోయింది. బ‌హుశ చంద్ర‌బాబు మ‌న‌సు బాగా చ‌ద‌వి ఉంటారేమో.. అందుకే ఇలా చేస్తున్నార‌ని.. అంటున్నారు సీనియ‌ర్లు కూడా!
Tags:    

Similar News