పనామా కుంభకోణం రేపిన సంచలనం అంతాఇంతా కాదు. పదుల సంఖ్యలోని దేశాధినేతలకు ముచ్చెమటలు పోయిస్తున్న ఈ కుంభకోణం వివరాలు బయటకు పొక్కటంతో వేలాది మంది ప్రముఖుల ఇమేజ్ ని రాత్రికి రాత్రికి తీవ్రంగా ప్రభావితం చేసిన పరిస్థితి. మిగిలిన వారి సంగతి పక్కన పెట్టి మనకు సుపరిచితుడైన బాలీవుడ్ దిగ్గజం.. క్లీన్ చిట్ ఉన్న అమితాబ్ బచ్చన్ వ్యవహారమే తీసుకుందాం. ఇంతకాలం ఆయన్ను పెద్దమనిషిగా.. నిండైన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా ఆరాధించే పరిస్థితి.
ఈ మధ్య కాలంలో ఆయన్ను రాష్ట్రపతి పదవికి ప్రతిపాదిస్తారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది నెలల్లో ప్రస్తుతం రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో ప్రదాని మోడీ బిగ్ బీ పేరును ప్రతిపాదించే అవకాశం ఉందన్న మాట పలువురి నోట వినిపించింది. నిజానికి ఇలాంటి వార్తలపై బిగ్ బీ ఏ మాత్రం స్పందించలేదు. అదే సమయంలో బిగ్ బీ పేరును రాష్ట్రపతి పేరుకు ప్రతిపాదిస్తూ చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు కూడా రాలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా బయటకు వచ్చిన పనామా పేపర్ల పుణ్యమా అని బిగ్ బీ మీద చెరుపుకోలేనంత భారీ మచ్చ పడిందనటంలో సందేహం లేదు. దాన్ని తుడుపుకోవటం అంత తేలికైన వ్యవహారం కాదు. నిజంగా ఆయన సచ్ఛీలుడే అయినా.. ఆయన్ను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయాలన్న ఆలోచనను ఎవరైనా వినిపిస్తే.. ఇప్పటివరకూ రాని వ్యతిరేకత ఇకపై రావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. అమితాబ్ తాజా పరిణామం భారీ షాక్ నే కాదు.. ఆయన్ను రాష్ట్రపతిగా చేయాలన్న ఆలోచనలు లాంటివి ఇప్పటికే చేస్తుంటే మాత్రం.. ఇక అలాంటిది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పక తప్పదు.