పవన్ స్థానిక ఎన్నికలంటే తెలుసా? నీ పార్టీ పరిస్థితేంటి?

Update: 2020-03-04 07:15 GMT
శాసనసభ, లోక్ సభ ఎన్నికల కన్నా స్థానిక సంస్థల ఎన్నికలే పార్టీలకు చాలా ముఖ్యం. పార్టీ కేడర్ ఎంత బలంగా ఉందో తెలిపేవే ఈ ఎన్నికలు. స్థానిక ఎన్నికలకు రాష్ట్ర, దేశంతో ముడిపడిన అంశాలు పనిచేయవు. పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తల బలం తెలిపేవే ఈ ఎన్నికలు. ఎంత బలగముందో అన్ని సీట్లు ఆయా పార్టీలకు వస్తాయి. క్షేత్రస్థాయిలో ఉండే పరిపాలన ఉంటుండడంతో తమ సత్తా చాటాలని చోట నాయకులు ఉవ్విళ్లూరుతుంటారు. వారికి స్థానిక సంస్థల ఎన్నికలు ఓ అద్భుత అవకాశం. అందుకే ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఎప్పటి నుంచో కలలు కంటుంటారు. ఇప్పుడు ఆ ఎన్నికలే కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో రానున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పోటీ చేస్తుందా లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అసలు పవన్ కల్యాణ్ కు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి ఉంటాయని తెలుసా? లేదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయాలు వదిలేసి సినిమాల్లో బిజీ అయ్యాడు. ఇటీవల ఆయన నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. సినిమాపరంగా ఆయన బిజీగా ఉన్న సమయంలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మరి ఈ ఎన్నికలకు పవన్ కల్యాణ్ పార్టీని సిద్ధం చేస్తాడా? లేదా? అనేది ప్రశ్నలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలమెంతో తెలిపేవి. ఇలాంటి కీలక ఎన్నికలను పవన్ పట్టించుకుంటాడా? పార్టీ వర్గాలే సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే ఈ ఎన్నికలకు పవన్ కల్యాణ్ ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఆయన సినిమాలతో బిజీగా ఉండగా పార్టీని పట్టించుకునే వాడు లేకపోయే. ఇటీవల ఉన్న పెద్ద దిక్కు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీ నుంచి పక్కకు వెళ్లినట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అస్సలు కనిపించడం లేదు. పైగా ప్రభుత్వం కేవలం 20 రోజుల్లో ఈ ఎన్నికలను పూర్తి చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేయాల్సి ఉండగా పవన్ కల్యాణ్ ఆ విధంగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ ఉండదని దాదాపుగా తెలుస్తోంది.

ఎందుకంటే 2019 ఎన్నికల్లోనే ఆ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యే, ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పోటీచేసిన 141 స్థానాల్లో ఒక్క సీటు పొందగా రెండుచోట్ల పోటీ చేసి పవన్ కల్యాణ్ ఘోరంగా ఓడిపోయారు. మరి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు రాష్ట్రంలో పరిణామాలు మారాయి. మరి పవన్ కల్యాణ్ కూడా మారిపోయాడు. బీజేపీ చెంత చేరిపోయి ఆయన సైడైపోయాడు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడమో లేదా మళ్లీ ప్రతిపక్షం టీడీపీకి మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమున్నా ఆయన సినిమాల్లో బిజీ ఉంటే రాష్ట్ర పరిస్థితులపై ఎప్పుడు ఫోకస్ పెడతారని సొంత పార్టీ నాయకులే కాకుండా ప్రత్యర్థులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ ఏం చేస్తాడో ఆయనకే తెలియాలి.


Tags:    

Similar News