పంచాయితి ఎన్నికలకు నగారా మోగిన దగ్గర నుండి చంద్రబాబునాయుడు ఒకటే ప్రశ్నను పదే పదే లేవనెత్తుతున్నారు. ఎంపిటీసీ, జడ్పీటీసీలు ఏకగ్రీవం అవ్వటంలో అధికారపార్టీ అరాచకాలు, ఆధిపత్య ధోరణుల కారణంగానే ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయంటూ మీడియా సమావేశాల్లో పదే పదే ఆరోపిస్తున్నారు. 2014లో లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలు చాలా తక్కువయ్యాయని అలాంటిది 2020లో మాత్రమే ఎందుకు ఎక్కువగా ఏకగ్రీవాలయ్యాయంటు మండిపడుతున్నారు.
నిజానికి వైసీపీని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వేసిన ప్రశ్నకు చంద్రబాబునాయుడుకే సమాధానం బాగా తెలుసు. అయినా తనకేమీ అర్ధం కానట్లు చాలా అమాయకంగా జనాలను, వైసీపీని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారపార్టీకి సహజంగానే అనుకూలంగా ఉంటుంది. దానికితోడు ప్రతిపక్షం ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో అక్కడల్లా అధికారపార్టీనే ఏకగ్రీవంగా గెలుస్తుంటుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.
2020లో వైసీపీకి అనుకూలంగా ఎక్కువ ఏకగ్రీవాలు అవ్వటానికి ప్రధాన కారణం 2019 ఎన్నికల ప్రభావమే అని చెప్పాలి. 2019 ఎన్నికల్లో జిల్లాలకు జిల్లాలను వైసీపీ ఫుల్లు స్వీప్ చేసేసింది. ఇది జరిగిన తొమ్మిది నెలలకే స్ధానిక సంస్ధల ఎన్నికలు రావటంతో టీడీపీ తరపున పోటీ చేయటానికి చాలామంది ఇష్టపడలేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల రిజల్టే పునరావృతమవుతుందని తమ్ముళ్ళు అనుమానించారు. అలాగే ఐదేళ్ళు అధికారంలో ఉండబోయే పార్టీతో గొడవలెందుకని కూడా చాలామంది టీడీపీ నేతలు పోటీకి ఇష్టపడలేదు.
ఎందుకంటే 2014లో వైసీపీ తరపున గెలిచిన చాలామందిని అధికారంలోకి రాగానే టీడీపీ బలవంతంగా పార్టీ ఫిరాయించేట్లు చేసింది. పార్టీ మారటానికి ఇష్టపడని వారిని రకరకాలుగా వేధించింది. ఇవన్నీ గుర్తున్న టీడీపీ నేతలు తమకు కూడా ఇదే జరుగుతుందన్న భావనతోనే ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. దాంతో చాలాచోట్ల వార్ వన్ సైడ్ అయిపోయింది. చంద్రబాబు పుట్టిపెరిగిన చంద్రగిరి నియోజకవర్గంలో కానీ సొంతూరు నారావారిపల్లెలో కూడా పోటీ చేయటానికి టీడీపీకి నేతలు దొరకలేదు.
అలాగే ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూడా కొన్నిచోట్ల ఏకగ్రీవాలైతే మరికొన్ని చోట్ల నామినేషన్లు వేశారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల గొడవలు జరిగిన విషయం కూడా వాస్తవమే. చంద్రగిరిలో అయినా కుప్పంలో అయినా పోటీకి నేతలు ముందుకు రాని చోట్లంతా ఏకగ్రీవాలయ్యాయి. ఇక 2014లో ఎందుకు ఏకగ్రీవాలు ఎక్కువ కాలేదని చంద్రబాబు అడుగుతున్నారు. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి. దానికంటే ముందు అప్పటి ప్రభుత్వం స్ధానిక సంస్ధల ఎన్నికలు జరపాలని డిసైడ్ అయ్యింది.
తొందరలోనే సాధారణ ఎన్నికలు జరుగుతున్న కారణంగా స్ధానిక ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో ఏ పార్టీ కూడా ఏకగ్రీవాలకు అంగీకరించలేదు. పైగా అప్పట్లో టీడీపీ, వైసీపీలు రెండూ ప్రతిపక్షంలోనే ఉన్నాయి. అధికార కాంగ్రెస్ ఏకగ్రీవాలపై దృష్టి పెట్టలేదు. కాబట్టి అప్పట్లో ఏకగ్రీవాలు చాలా తక్కువగా జరిగాయి. ఇవన్నీ చంద్రబాబుకు తెలీక వైసీపీని, జగన్ను నిలదీయటం లేదు. కావాలనే జనాలను తప్పుదోవ పట్టించాలన్నది ఫార్టీ ఇయర్స్ ఉద్దేశ్యమంతే.