తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏపీలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఏకగ్రీవమైన పంచాయతీలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రామచంద్రాపురం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అదేవిధంగా నారాయణవనం మండలంలోని 19 పంచాయతీలలోని ఐదు పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవం అయ్యారు. ఇక పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలంలోని పది గ్రామ పంచాయతీలలో కూడా ఇదే తరహాలో ఏకగ్రీవాలు జరిగాయి.
పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు గాను 12 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.