గెలిచింది భార్యలు.. ప్రమాణం చేసింది భర్తలు.. మన పాలిటిక్స్ అంతే బ్రో!
సాధారణంగా.. ఎక్కడ ఎలాంటి ఎన్నికలు జరిగినా.. పోటీ చేసి గెలిచిన వారే తర్వాత.. ప్రమాణ స్వీకారం చేసి.. పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ, మన దేశంలోని పంచాయతీ వ్యవస్థ దీనికి భిన్నంగా నడుస్తోందనే ఆరోపణలు వున్నాయి. పంచాయతీల్లో పోటీ చేసి గెలిచిన భార్యల తరఫున పెత్తనం అంతా.. భర్తలే చేస్తుంటారనే టాక్ సర్వత్రా వినిపస్తూనే ఉంటుంది.
రాష్ట్రం అదా.. ఇదా.. అనేది కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పద్ధతి కొనసాగుతోంది. అంతేనా.. ఒక్క పంచాయతీల్లోనే కాదు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలుగా గెలిచిన భార్యలను నామ్‌కే వాస్తే.. చేసి.. అధికారాలు చలాయించిన భర్తలు ఎక్కువగానే ఉన్నారు. ఉంటున్నారు.
అయితే.. గెలిచిన తర్వాత.. పదవులకు సంబంధించి ప్రమాణాలు మాత్రం భార్యలే చేస్తారు. తర్వాత.. అధికారం మాత్రమే భర్తలు పంచుకుంటున్నారు. కానీ, ఇప్పుడు ఈ చిన్న గీత కూడా చెరిగిపోయింది. భార్యలు గెలిచారు. అయితే.. ఇక, ఆ వెంటనే.. భర్తలు రంగంలోకి దిగిపోయారు. ప్రమాణ స్వీకారం కూడా వారే చేసేసి.. అందరినీ విస్మయానికి గురి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎక్కడ జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గెలిచిన వారు ప్రమాణస్వీకారం చేశారు. అయితే సాగర్, దమోహ్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో గెలిచిన మహిళల స్థానంలో వారి కుటుంబంలోని భర్తలు, పురుషులు ప్రమాణం చేయడం స్థానికంగా వివాదాస్పదంగా మారింది. జైసినగర్ గ్రామంలో 10 మంది మహిళలు పంచాయతీ సభ్యులుగా ఎన్నికవ్వగా.. ఓ మహిళ స్థానంలో ఆమె తండ్రి ప్రమాణం చేశారు. మరో ఇద్దరు మహిళల భర్తలు, మరో మహిళ బావ ప్రమాణస్వీకారం చేశారు. దామోహ్ జిల్లాలోని గైసాబాద్, పిపారియా కిరౌ గ్రామాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి.
ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కావడం వల్ల ఈ వ్యవహారం బయటికొచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవడం వల్ల సాగర్ జిల్లా పంజాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు. జైసినగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆశారాం సాహూను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
"పంచాయతీ సభ్యులుగా గెలిచిన మహిళలను ప్రమాణస్వీకారానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా వారు రాలేదు. వారికి బదులుగా తమ బంధువులను పంపించారు. దీంతో చేసేదేం లేక, వారితోనే ప్రమాణం చేయించాం" అని సాహూ చెప్పడం గమనార్హం. కానీ, రాజ్యాంగం ప్రకారం.. పంచాయతీ రాజ్ చట్టాల ప్రకారం.. ఇది చెల్లదని.. మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ విషయం వివాదానికి దారితీసింది.