ఇంటిపై పార్టీల జెండాలు పెట్టారో జీవితాంతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే ..?

Update: 2020-03-11 06:46 GMT
ఆంధప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఎన్నికల హడావిడిలో మునిగిపోయాయి. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా ఎన్నికల కోలాహాలం మొదలైంది. ఈ ఎన్నికలని అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ..స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలని తలపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే పార్టీల అధినేతలు కూడా తమ ప్రచారం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

కాగా, జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం బుధవారంతో ముగియబోతుంది. దీనితో రేపటి నుంచే అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజీ కానున్నారు. ఇది ఈ విదంగా కొనసాగుతుంటే .. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఎలక్షన్ అధికారుల ఆదేశాల జారీచేయడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా దానికి తగ్గ ప్రణాళికలు రచించడంలో బిజీగా ఉంది. ఇప్పటికే అనుమానిత ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది.

ఈ ఎన్నికల్లో డబ్బు , మద్యాన్ని పంచడాన్ని ప్రభుత్వం నిషేధించిన ప్రస్తుత పరిస్థితుల్లో , అలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికల ప్రచార నియమావళికి నిక్కచ్చిగా అమలు చేయడంపై దృష్టి సారించింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే నాయకులను గానీ, కార్యకర్తలను గానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది పోలీసు శాఖ. ఎన్నికలు కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే , కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అలాగే ఇదే సమయంలో ఎన్నికల సిబ్బంది నుండి పర్మిషన్ లేకుండా ఇంటి మీద పార్టీ జెండా ఎగురవేసినా, ఎన్నికల గుర్తును అమర్చినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేల ఆలా చేస్తే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని , ఒక్కసారి ఎవరిపైనైనా బైండోవర్ కేసులు నమోదు చేస్తే , మీరు బ్రతికున్నంత కాలం ఎన్నికలు జరిగిన ప్రతిసారి పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News