పంచాయతీ పోరు : క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఎలెక్షన్ కమిషన్ .. పూర్తి వివరాలివే !
గత కొన్ని రోజులుగా హీటెక్కించిన ఏపీ స్థానిక పోరు పర్వం ముగిసింది. అయితే , తుది ఫలితాల లెక్కలపై అధికార, విపక్షాలు పరస్పరం విభేదించుకుంటూనే వున్నాయి. ఏపీ సర్కార్ తో తీవ్రస్థాయిలో విభేదించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు పర్వాన్ని పూర్తి చేశారు. ఆదేశాలు, వాటి రద్దు.. కోర్టు వ్యాజ్యాలు, అధికారుల బదిలీలు ఇక రాజకీయ పార్టీల విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా ఏపీ పంచాయితీ ఎన్నికలు ఆద్యంతం ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. ఎన్నికలైతే ముగిసాయి కానీ వైసీపీ, టీడీపీల మధ్య ఏకగ్రీవాల గణాంకాల లెక్కలకు ముగింపు రాలేదు. ఎవరికి వారు తమకు అనుకూలంగా గణాంకాలను వెల్లడించుకుంటున్నారు. తమదే పైచేయి అని ప్రచారం చేసుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా పంచాయతీ ఎన్నికల లెక్కలను వెల్లడించింది. ఆ వివరాలని ఒకసారి చూస్తే ..
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 13 వేల 97 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా , వాటిల్లో 2,197 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం అయిన సర్పంచుల శాతం 16.77. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్షా 31 వేల 23 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించారు. అందులో 47 వేల 459 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. ఏకగ్రీవం అయిన వార్డులు 36.22 శాతం గా నమోదు అయింది. ఇక మొత్తం నాలుగు విడతల్లో జరిగిన పంచాయితీ పోలింగ్ శాతం 81.78. ఏపీలో మొత్తం జిల్లాలు-13 కాగా.. రెవిన్యూ డివిజన్లు-51, మండలాలు -655, గ్రామ పంచాయతీలు -13,330, వార్డు సభ్యులు 1,33,584గా వున్నాయి.
ఇక , ఈ ఎన్నికల్లో అస్సలు నామినేషన్లు దాఖలు కానీ పంచాయతీల సంఖ్య 10. నామినేషన్లు దాఖలు కానీ వార్డుల సంఖ్య 670. మొత్తం ఏకగ్రీవాలు 2,197. ఎన్నికలు జరిగిన పంచాయతీలు 47 వేల 459 కాగా.. పోటీ పడిన అభ్యర్థులు 30 వేల 245 మంది. వార్డు సభ్యులకు పోటీ పడిన అభ్యర్థులు లక్షా 84 వేల 339 మంది. మొత్తం ఓటర్లు రెండు కోట్ల 77 లక్షల 17 వేల 784 మంది. అందులో పురుషులు 1,37,55,364 మంది, మహిళలు 1,39,58,673 మంది . ఇతరులు 3,747. మొత్తం నాలుగు విడతల్లో పోలైన ఓట్ల సంఖ్య 2,26,67,604 కాగా.. పోలింగ్ శాతం 81.78 %గా నమోదు అయినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఇక , పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల పరిశీలకులు (ఐఏఎస్) 13 మందిని, ఖర్చుల పరిశీలకులు (ఐఎఫ్ ఎస్) 13 మందిని, నోడల్ అధికారులు 13 మందిని నియమించారు. స్టేజ్ 1 టర్నింగ్ అధికారులు 5,249 మంది, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులు 13,052 మంది, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 7,854, పోలింగ్ అధికారులు (పిఓ) 1,31,443 మంది, అదనపు పోలింగ్ అధికారులు 1,91,919 మంది, జోనల్ అధికారులు 2,159 మంది, రూట్ అఫీసర్స్ 4,965 మంది, మైక్రో అబ్జర్వర్స్ 11,298 మంది, వెబ్ కాస్టింగ్ సేవకులు 5,464 మంది కలిపి మొత్తం మూడు లక్షల 73 వేల 397 మంది ఎన్నికల నిర్వహణలో విధి నిర్వహణలో పాల్గొన్నారు.
వీరి సంఖ్య నాలుగు విడతల యావరేజ్ 93,349గా ప్రకటించింది. మొత్తం కౌంటింగ్ సూపర్ వైజర్స్ 63,540 మంది, కౌంటింగ్ సిబ్బంది 1,71,773 మందిని వినియోగించినట్లు ఎన్నికల కమిషన్ వివరించింది. రాష్ట్రంలో మొత్తం లక్షా 14 వేల 882 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 19 వేల 103గా గుర్తించారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా 15 వేల 869గా గుర్తించి ఏర్పాట్లు చేశారు. తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల 49 కేంద్రాల్లో హింసాత్మక సంఘటనలు జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం హింసాత్మక ఉదంతాల సంఖ్యను 37 వేల 21గా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా స్థానిక ఎన్నికలని విజయవంతంగా పూర్తి చేసినట్టు ప్రకటించింది.