దోమలతో కరోనా వస్తుందా? డబ్ల్యూహెచ్.వో ఏమందంటే?

Update: 2020-06-28 00:30 GMT
ఇప్పుడు ప్రపంచానకే కరోనా పెను సవాల్ విసురుతోంది. వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఆపసోపాలు పడుతున్నారు. మహమ్మారికి మందు లేక ప్రాణాలు పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వైరస్ బాధితుల సంఖ్య 97 లక్షలు దాటింది.

ప్రస్తుతం వేసవికాలం పోయి వానాకాలం రావడంతో ఈ వైరస్ శీతల వాతావరణంలో మరింత విజృంభించడం ఖాయమని ఆందోళన నెలకొంది. వానాకాలంలో దోమలు విజృంభిస్తాయి. ఈ దోమల ద్వారా కూడా కరోనా వస్తుందనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో ఎక్కువైంది.

దోమలతో కరోనా వస్తుందా లేదా అన్నదానిపై తాజాగా ఇటలీ నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఎస్) శాస్త్రీయ అధ్యయనం చేసింది. మానవుల్లో దోమలు కరోనా వ్యాప్తి చేయలేవని నిర్ధారించారు.

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో) కూడా స్పందించింది. రక్తం పీల్చే కీటకాల (దోమలు, నల్లులు లాంటివి) ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందదని తేల్చిచెప్పింది.
Tags:    

Similar News