ఏపీ కరోనా అప్డేట్ : 7 లక్షలు దాటిన కేసుల సంఖ్య .. కొత్తగా ఎన్నంటే ?

Update: 2020-10-01 17:52 GMT
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. తాజాగా గురువారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 6,751 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,869కి చేరింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,577 టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 57,858 యాక్టివ్ కేసులు ఉండగా... 6,36,508 మంది కోలుకున్నారు.గత 24 గంటల్లో 7,297మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 57,858మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 986, చిత్తూరు జిల్లాలో 888, ప్రకాశం జిల్లాలో 783, పశ్చిమగోదావరి జిల్లాలో 753, గుంటూరు జిల్లాలో 594, నెల్లూరు జిల్లాలో 472, కృష్ణా జిల్లాలో 424, కడప జిల్లాలో 400, అనంతపురం జిల్లాలో 333, శ్రీకాకుళం జిల్లాలో 301, విశాఖపట్నం జిల్లాలో 277, విజయనగరం జిల్లాలో 275, కర్నూలు జిల్లాలో 265 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 98160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags:    

Similar News