రికార్డ్ స్థాయిలో వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండడంతో అందుకు తగ్గట్టు కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే ఏకంగా 25 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ కాలంలోనే కేసుల నమోదులో సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో లక్ష దాటిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. తాజాగా 6,051 మందికి పాజిటివ్ నిర్ధారణ అవడంతో లక్ష మైలురాయిని ఏపీ తాకింది. తాజాగా 49మంది వైరస్‌తో మృత్యువాత పడ్డారు. కేసుల సంఖ్య వారం నుంచి చూస్తే కొద్దిగా తగ్గాయి. కానీ విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి రోజు వేలల్లో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజాగా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య లక్ష మార్కును దాటి 1,02,349 కి చేరింది.
కోలుకున్న వారు 49,558 మంది ఉండగా.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 51,701. ఆంధ్రప్రదేశ్‌లో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇప్పటికే 1,090 మంది వైరస్‌తో మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 14,696 కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లా 12,234, గుంటూరు జిల్లా 10,747, అనంతపురము జిల్లా 10,247 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరణాల లెక్క పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 164 మంది వైరస్‌తో మృతి చెందారు. అనంతరం కృష్ణా జిల్లా 149, తూర్పుగోదావరి జిల్లా 129 ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16,86, 446 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 3,234 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.