తెలంగాణ‌లో అదే ఉధృతిలో వైర‌స్‌: ‌తాజాగా 879 పాజిటివ్‌

Update: 2020-06-23 18:00 GMT
వైర‌స్ ఉధృతి తెలంగాణ‌లో కొన‌సాగుతోంది. వెయ్యికి చేరువ‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచ‌డంతో కేసులు కూడా భారీస్థాయిలో వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా సోమ‌వారం క‌న్నా మంగ‌ళ‌వారం ఐదు కేసులు అధికంగా వ‌చ్చాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా 879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైర‌స్‌తో బాధ‌ప‌డుతూ ముగ్గురు మృతి చెందారు. ఈ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 652 వెలుగులోకి వ‌చ్చాయి. తాజాగా మరో 11 జిల్లాల్లో కేసులు వ‌చ్చాయి.

ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. 3,006 ప‌రీక్ష‌లు చేయ‌గా 879 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. తాజా వాటితో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 9,553కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 220గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 4,224 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 5,109. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో చేసిన ప‌రీక్ష‌లు 63,249.

తాజా కేసులు ఇలా ఉన్నాయి.
జీహెచ్ఎంసీ 652, రంగారెడ్డి 64, మేడ్చ‌ల్ 112, జ‌న‌గామ 7, సంగారెడ్డి 2, వ‌రంగ‌ల్ గ్రామీణ 12, మంచిర్యాల 2, కామారెడ్డి 10, వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణ 9, మ‌హ‌బూబాబాద్ 2, మెద‌క్ 1, నాగ‌ర్‌క‌ర్నూల్ 4.
Tags:    

Similar News