కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం పలు నిబంధనలు అమలు చేస్తోంది. మాస్కు ధారణ తప్పనిసరి చేసింది. మాస్కు ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆరోగ్య శాఖ అవగాహనా కార్యక్రమాలు కూడా చేపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో ), యునిసెఫ్ కూడా మాస్కు ధారణపై పలు మార్గ దర్శకాలు విడుదల చేశాయి. అయితే పెద్దల మాస్కు ధారణపై డబ్ల్యూహెచ్ వో , యునిసెఫ్ పలు సూచనలిచ్చినా చిన్న పిల్లల విషయంలో మాత్రం ఎటువంటి సూచనలు చేయలేదు. చాలా మందికి పిల్లలు మాస్కు పెట్టుకునే విషయమై పలు సందేహాలు ఉన్నాయి. కొందరు పిల్లలకు ఏం కాదని మాస్కు పెట్టడం లేదు.
ఈ విషయమై డబ్ల్యూహెచ్ వో పలు సూచనలు చేసింది. 12ఏళ్లకు పైబడిన పిల్లలకు కచ్చితంగా మాస్కు ధరింపజేయాలని తెలిపింది. ఒక మీటరు భౌతిక దూరం పాటింపజేయాలని సూచించింది. యునిసెఫ్ కూడా ఇవే సూచనలే చేసింది. 6 నుంచి 11 ఏళ్ల పిల్లల విషయంలో మాస్కు ధారణ అనేది వాళ్లు నివసించే ప్రాంతాన్ని బట్టి తల్లిదండ్రులే నిర్ణయం తీసుకోవాలి. కరోనా తీవ్రతను బట్టి మాస్కు పెట్టాలి. అలాగే పిల్లల ఆరోగ్యంలో ఏమైనా సమస్యలు ఉంటే మాస్కు తప్పనిసరి. కరోనా నిరోధానికి తప్పనిసరిగా మాస్కు ధరించాలని జూన్ 5న డబ్ల్యూ హెచ్ వో ప్రకటించింది. కానీ అప్పుడు పిల్లల విషయంలో మాత్రం ఎటువంటి సూచనలు చేయలేదు. తాజాగా 12ఏళ్లకు పైబడిన పిల్లలకు మాస్కు ధారణ తప్పనిసరి అని సూచనలు ఇచ్చింది.