దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ కూడా 50 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే దేశంలో సామాన్యుల నుండి ప్రముఖులు , ప్రజాప్రతినిధులు కూడా కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం , కర్ణాటక సీఎం కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే దేశవ్యాప్తంగా పలువురు ఎంపీలు , ఎమ్మెల్యేలు కూడా కరోనా భారిన పడ్డారు. తాజాగా మరో యూపీ మంత్రికి కరోనా పోసిటివ్ గా నిర్దారణ అయింది. యూపీ న్యాయ శాఖ మంత్రి బ్రజేశ్ పాఠక్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.
ప్పటికే రాష్ట్రానికి చెందిన సాంకేతిక విద్యాశాఖ మంత్రి కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చోటుచేసుకుని వారం రోజులు కూడా గడవకముందే, మరో మంత్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యుల సూచన మేరకు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. రిపోర్టులో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని, తనను ఇటీవల కలిసిన వారంతా వెంటనే క్వారంటైన్‌లో ఉంటూ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కాగా, యూపీలో ఇప్పటికే లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.