కరోనా: భారతీయులకు గుడ్ న్యూస్

Update: 2020-08-27 00:30 GMT
కరోనాను పుట్టించిన చైనాలో ఇప్పుడు ఆ వైరస్ ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ ప్రజల్లో వచ్చేసిందట.. ఏకంగా 80శాతం వరకు రికవరీ రేటు ఉంటోంది. ఇప్పుడు అక్కడ మాస్కులు కూడా లేకుండా జనాలు సంచరిస్తున్నారు. ఇటీవలే ఫొటోలు, వీడియోలు కూడా వచ్చాయి.

ప్రస్తుతం దేశంలో కూడా గుడ్ న్యూస్ వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతోంది. కరోనా కేసులను కట్టడి చేయడానికి గాను భారత్ ఇప్పుడు పరీక్షల సంఖ్యతో పాటు రికవరీ రేటుని కూడా చాలా వేగంగా పెంచే ప్రయత్నం చేస్తోంది.

కరోనా రికవరీ రేటు మీద రాష్ట్రాలు కూడా ఎక్కువగా దృష్టి పెట్టాయి. మన దేశంలో రోజురోజుకి రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 76శాతానికి చేరుకుంది.

భారత్ లో 24 గంటల్లో 66వేల మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపు సగానికి పైగా రాష్ట్రాల్లో రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణలో రికవరీ రేటు చైనాతో సమానంగా 80శాతం ఉండడం విశేషంగా మారింది.
Tags:    

Similar News