పెళ్లి .. జీవితంలో ఒకే ఒకసారి వచ్చే అత్యంత కీలకమైన వేడుక. ఈ పెళ్లి పై ఎంతోమంది యువతి , యువకులు కలలు కంటుంటారు. అయితే , కరోనా మహమ్మారి దెబ్బతో పెళ్లిళ్లు జరిగే విధానమే మారిపోయింది. కరోనా సమయంలో చాలామంది కరోనా కి బయపడి పెళ్లిళ్లు ఆపుకున్నారు. ఇక సెలెబ్రెటీలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లే వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా సమాజంలో ఎవరికి వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు చాలా మంది తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. భౌతిక దూరం పాటించే క్రమంలో ఎన్నో ఇబ్బందులకూ గురవుతున్నారు.
అయితే , పెళ్లి కొడుకు లేక పెళ్లి కూతురికి కరోనా వస్తే పెళ్లి వాయిదా వేయాల్సిందే. అయితే , తాజాగా వధువుకి కరోనా పాజిటివ్ అని తెలిసినా కూడా వరుడు అనుకున్న ముహుర్తానికే పీపీఈ కిట్లు ధరించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ..రాజస్తాన్ కు చెందిన ఓ యువతికి కొద్ది రోజుల క్రితం వివాహం నిశ్చయమయ్యింది. తీరా పెళ్లి ముహుర్తం సమీపించాక ఆమెకి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో కరోనా కేర్ సెంటర్ లో జాయిన్ చేశారు.
వధువుకు కరోనా సోకిందని సరిగ్గా పెళ్లి రోజున తెలియడంతో పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక పెళ్లి కొడుకు ఈ విధంగా ప్లాన్ చేశాడు. రాజస్థాన్ షాబాద్ జిల్లాలోని బారాలో కరోనా చికిత్స కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పురోహితుడు కూడా పీపీఈ కిట్లను ధరించి పెళ్లి జరిపించారు. పూజారి చెప్పిన విధంగా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి తంతు ఆచరించారు. మూడ ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.