జనవరిలో వ్యాక్సిన్ వస్తుంది , కానీ అందరికి ఇవ్వరట !

Update: 2020-12-14 09:46 GMT
కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నుండి దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైయ్యే అవకాశాలు ఉన్నాయి. జనవరిలో వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో తయారు చేసిన మూడు వ్యాక్సిన్ల తో పాటుగా .. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన వాక్సీన్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. అయితే కరోనా టీకా అందరికీ అవసరం లేదని, ప్రస్తుతానికి దేశ జనాభాలో 20శాతం మంది టీకా వేయించుకుంటే సరిపోతుందని చెబుతోంది. ఫ్రంట్ లైన్ సిబ్బంది తో పాటు, 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ముందుగా టీకా ఇస్తే, మునుపటి రోజులు మళ్లీ వస్తాయనే అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేస్తుంది.

ఆ తర్వాత మెల్లి మెల్లిగా అందరికి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఈ మేరకు టీకా ఇచ్చేందుకు మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా ఫ్రంట్ లైన్ సిబ్బందికి, 50 ఏళ్లు దాటిన వ్యక్తులకు ముందుగా టీకా ఇస్తారు. వాళ్లలో కూడా 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. వాక్సిన్ కేంద్రంలో కనీసం ఒక రోజులో 200 మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. వాక్సీన్ తీసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా కేంద్రం అభివృద్ధి చేసిన కో-విన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే కరోనా విజృంభణ సమయంలో డాక్టర్స్ , అలాగే సిబ్బంది ఎలా అయితే పని చేసారో ఇప్పుడు కూడా అలాగే పనిచేసి వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉండాలి. మొత్తంగా తొలి దశలో 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
Tags:    

Similar News