ఆప్ఘనిస్థాన్లో తాలిబన్లను ధైర్యంగా ఎదిరించగలిగింది పంజ్ షీర్లు మాత్రమే అనే ధైర్యం, ఆశలు కుప్పకూలిపోయాయా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అందరిలోను ఇలాంటి అనుమానాలే పెరిగిపోతున్నాయి. పంజ్ షీర్ నాయకుడు, ప్రపంచ ఆశాదీపం అహ్మద్ మసూద్ సలహాదారుడు తాజాగా మాట్లాడుతూ తాలిబన్లతో పోరాడేంత సీన్ తమకు లేదని మసూద్ భావిస్తున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది.
తాలిబన్లను ఎదిరిస్తారని పంజ్ షేర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రపంచ దేశాల ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయింది. దీనికి కారణం ఏమిటంటే సలహాదారు చెప్పిన ప్రకారం తాలిబన్లు ఇపుడు వాళ్ళ కన్నా చాలా బలంగా ఉన్నారట. ఒకపుడు తాలిబన్లకు ఇప్పుడున్నంత బలం లేదన్నారు. కానీ ఇపుడు అమెరికా అందించిన ఆయుధాలు, వదిలిపెట్టేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లను తాము ఏ విధంగా ఎదిరించలేమని సలహాదారు స్పష్టంగా చెప్పేశారు.
అన్నింటికీ మించి రెండు సమస్యలు పంజ్ షీర్లను బాగా పట్టి పీడిస్తోందట. మొదటిదేమో పంజ్ షీర్ లో ఉన్నది కూడా 6 వేల మంది ఫైటర్లు మాత్రమే అన్నారు. అది కూడా పరిమితమైన ఆయుధాలతోనే. ఇక రెండో సమస్య ఏమిటంటే ప్రపంచదేశాల్లో ఒక్కటి కూడా పంజ్ షీర్లకు మద్దతుగా నిలబడకపోవటం. పంజ్ షీర్ల దగ్గర కూడా అధునాతన ఆయుధాలున్నప్పటికీ ఇపుడు తాలిబన్ల దగ్గరున్న ఆయుధాల ముందు పెద్దగా పనికిరావని అర్ధమైపోయింది. ఆయుధం పరంగా తాలిబన్లు ఒక్కసారిగా బాగా బలోపేతం కావడానికి కారణం అమెరికాయే అని పంజ్ షీర్లు ఆరోపిస్తున్నారు.
ఇదే సమయంలో పంజ్ షేర్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుండి తాలిబన్లు చుట్టుముట్టేశారు. తాలిబన్ల సంఖ్య సుమారు లక్ష ఉండగా పంజ్ షేర్ల సంఖ్య సుమారు 7 వేలు మాత్రమే. వీళ్ళకు జనాల మద్దతున్నా చేయగలిగిందేమీ లేదని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్లతో పోరాడాలా ? లేకపోతే గౌరవప్రదమైన సంధి కుదుర్చుకోవాలా అని తమ నేత మసూద్ ఆలోచిస్తున్నట్లు సలహాదారు చెప్పటంతో కలకలం మొదలైంది. తమకు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలబడాలని మసూద్ విజ్ఞప్తి చేసినా ఎవరు పట్టించుకోలేదు.
దాంతో తాలిబన్లతో పోరాడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని మసూద్ నిర్ణయానికి వచ్చారట. ఇపుడీ అంశమే అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. గతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలు పోరాడినపుడు పంజ్ షేర్లు మద్దతుగా నిలిచారు. మరిప్పుడు తమకెవరు ఎందుకు మద్దతుగా నిలబడటం లేదో పంజ్ షేర్లకు అర్ధంకావట్లేదు. ఈ కారణంగానే వీళ్ళల్లో నిరాస మొదలైపోయిందని సలహాదారు చెప్పటం ఆలోచించాల్సిందే.