ఛాన్స్ కోసం ఆ ఇద్దరూ గవర్నర్ ను కలిశారు

Update: 2017-02-15 17:56 GMT
తమిళనాడు అధికారపక్షం అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం చివరకు వచ్చేసింది. పార్టీ చీఫ్ శశికళ జైలుకు వెళ్లిపోవటంతో సీన్లోకి ఆమె బదులుగా.. ఆమె విధేయుడు పళనిస్వామి.. మాజీ విధేయుడు పన్నీర్ సెల్వం మిగిలారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ తహతహలాడుతున్న ఇద్దరు సీఎం ఆశావాహులతో గవర్నర్ భేటీ అయ్యారు.

గవర్నర్ ను కలిసే సందర్భంలో ఇరువురు నేతలు.. తమ మద్దతుదారులతో కలిసి భేటీ అయ్యారు. తనకు124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పిన పళని స్వామి.. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ నుఅభ్యర్థించారు. ఈ సందర్భంగా పది మంది మంత్రులు.. ఎమ్మెల్యేలతో కూడిన వర్గం గవర్నర్ తో భేటీ అయ్యింది.

ఇక.. బయటకు బలం తక్కువగా కనిపిస్తున్న అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా తనతో తన మద్దతుదారుల్ని తీసుకొని వెళ్లారు. మర్యాదపూర్వకంగా కలిసిన పన్నీర్.. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఇరువర్గాల వాదన విన్నగవర్నర్ ఏమీ రియాక్ట్ కాలేదు. తన నిర్ణయాన్నివెల్లడించలేదు. మరోవైపు.. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. శుక్రవారం తమిళనాడు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి.. కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందన్న మాట విపిస్తోంది. ఈ విధానాన్ని అనుసరిస్తే.. ఈ ఎపిసోడ్ నుంచి ఎలాంటి విమర్శలకు గురి కాకుండా బయటపడొచ్చని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News