విలీనం కోసం అన్నాడీఎంకే పార్టీలోని రెండు శిబిరాలు చేస్తున్న ప్రయత్నాలు మరోమారు నిలిచిపోయాయి. జాప్యానికి కారణం మీరేనంటే మీరేనంటూ వైరి శిబిరాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గం కీలకనేత కేపీ మునుస్వామి విలేకర్లతో మాట్లాడుతూ, సీఎం పళనిస్వామి శిబిరంలో గందరగోళం నెలకొందని, విలీన చర్చల కోసం ఏర్పాటు చేసే కమిటీ విషయంలోనూ పలువురు నాయకులు పలురకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ``పళనిస్వామి వర్గం నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరు. వాళ్లను ఎవరో నియంత్రిస్తున్నారు. పార్టీని నాశనం చేసే సామర్థ్యం శశికళకు ఉంది`` అని ఆరోపించారు. జయ మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళను, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను, ఇతర కుటుంబసభ్యులను పార్టీ నుంచి బహిష్కరించాలని మునుస్వామి స్పష్టం చేశారు. పార్టీ అధికారపత్రికలో.. అన్నాడీఎంకే శ్రేణులు శశికళ-దినకరన్ వెంట ఉన్నాయనడంపై అభ్యంతరం తెలిపారు.
మరోవైపు సీఎం పళనిస్వామి శిబిరం కీలకనేత వైతిలింగం మీడియాతో మాట్లాడుతూ తమలో గందరోగోళం లేదని, విలీన చర్చలకు ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. చర్చలకు పన్నీర్ సెల్వం గ్రూప్ నేతలకు సమాచారం పంపినా, వారు ముందుకు రాలేదన్నారు. జయ మరణించాక రెండు నెలలపాటు సీఎంగా ఉన్నప్పుడే పన్నీర్‌సెల్వం ఎందు కు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేదని ప్రశ్నించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళ చేపట్టిన అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నదని, ఈసీ నిర్ణయం ప్రకారం పార్టీ ఐక్యతను కాపాడుతామన్నారు. పళనిస్వామి వర్గం మరోనేత షణ్ముగం విలీన చర్చలకు కమిటీని ఏర్పాటు చేయలేదనడం గమనార్హం.
ఇదిలాఉండగా...పార్టీ ఐక్యత, పన్నీర్ సెల్వం కోసం తన పదవికి రాజీనామా చేయటానికీ సిద్ధమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి డి జయకుమార్ ప్రకటించటాన్ని పన్నీర్ వర్గం నిశితంగా పరిశీలిస్తున్నది. మంత్రి పదవి ఇస్తాంగానీ, సీఎం కుర్చీ మాత్రం ఇచ్చేది లేదని పళనిస్వామి ఈ విధంగా సంకేతమిచ్చారని ఆ వర్గం అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/