ప్రాంతీయ రాజకీయ పార్టీల బలానికి తమిళనాడు పెట్టింది పేరు. ఇప్పటిదాకా అక్కడ అటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ గానీ - దినదిన ప్రవర్ధమానంగా వెలిగిపోతున్న బీజేపీ గానీ, దేశంలో ఎప్పటినుంచి అధికారంలోకి వచ్చిన పార్టీల దమననీతిపై పోరు సాగిస్తున్న వామపక్షాలు గానీ... తమిళనాట పెద్దగా ప్రభావం చూపిన దాఖలా ఇప్పటిదాకా లేదు. అసలు ఆ రాష్ట్రంలో పాదం మోపేందుకు కూడా ఇప్పటికీ బీజేపీకి సాధ్యం కాలేదు. దేశాన్ని అత్యధిక కాలం పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేయాలంటే... తమిళ పార్టీల్లో దేనితోనే ఒకదానితో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి. అయినా ఆ పార్టీకి ఏనాడైనా చెప్పుకోదగ్గ స్థానాలేమైనా వచ్చాయా? అంటే... అదీ లేదు. ఎప్పుడు చూసినా... అరకొర సీట్లే తప్పించి... అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ముందు కనీస గళం విప్పే స్థానాలను కూడా ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది.
అలాంటిది ఇప్పుడు తమిళనాట బీజేపీ ఏది చెబితే... అది జరిగిపోతోంది. ప్రాంతీయ పార్టీల్లో అత్యంత బలమైన పార్టీలుగా పేరున్న అక్కడి అన్నాడీఎంకే గానీ, డీఎంకే గానీ ఇప్పుడు సడీ చప్పుడు లేకుండానే కాలం వెళ్లదీస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడం మినహా... అక్కడ మరే విషయం కూడా జరగడం లేదు. విపక్షంగా ఉన్న డీఎంకే కూడా ఏమాత్రం పనిచేస్తున్న దాఖలా కనిపించడం లేదు. ఏ అంశంపై నోరు విప్పితే... ఎక్కడ దెబ్బ పడుతుందోనన్న భయం ఆ పార్టీని వెంటాడుతోంది. ఇదంతా తమిళ తంబీలంతా *అమ్మ*అని అప్యాయంగా పిలుచుకునే పురచ్చితలైవి జయలలిత మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు. ఒక్క జయలలిత మరణంతోనే తమిళ నాట రాజకీయ శూన్యం ఏర్పడింది. అప్పటిదాకా తమిళ నాట అడుగుపెట్టేందుకు ఒకటికి రెండు సార్లు యోచించే జాతీయ పార్టీలు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా అక్కడికి వెళ్లి వస్తున్నాయి. అక్కడి పాలనను తమ చేతుల్లోకి తీసేకున్నాయి.
సంపూర్ణ మెజారిటీ ఉన్న అన్నాడీఎంకేలో ఏ నేత సీఎం కావాలి? ఆ సీఎం ఎప్పుడు దిగిపోవాలి? ఆ స్థానంలో మరెవరకు ఎక్కాలి? అన్న అన్ని అంశాలను బీజేపీ తన కనుసన్నలతోనే శాసిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను ఏన్డీఏ ఎంపిక చేసింది. ఎన్డీఏ పక్షాలన్నీ ఆయనకు మద్దతు పలుకుతుండగా, అసలు ఏ ఒక్కరు మద్దతు అడగకున్నా కూడా అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు కూడా కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చేశాయి. ముందుగా సీఎం పళనిస్వామి మద్దతు పలకగా, ఆ తర్వాత మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా కోవింద్ కు మద్దతు పలికారు. తాజాగా నిన్న అన్నాడీఏంకే ఉపప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్ వర్గం కూడా కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించేసింది. ఇదంతా చూస్తుంటే... తమ రాష్ట్రంలోకి జాతీయ పార్టీల ఎంట్రీని అడ్డుకున్న తమిళ తంబీలు ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్‌కు తలొంచినట్లుగానే కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/